ఆ సమయంలో అందరికీ దూరంగా...!
మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ... క్యాన్సర్ వ్యాధిని జయించడం కష్టం ఏమీ కాదు. అయితే ఆ సమయంలో చాలా ధైర్యంగా మనో నిబ్బరం గా ఉండాలి.
తెలుగు లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో మమతా మోహన్ దాస్ నటనకి అంతా ఫిదా అయ్యారు. తెలుగు లో కమర్షియల్ సక్సెస్ లు దక్కినా కూడా ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు రాలేదు.
హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా పాపులారిటీ విషయంలో స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గలేదు. దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్ ను కొనసాగించిన మమతా మోహన్ దాస్ మధ్య లో క్యాన్సర్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నాళ్లకు సినిమాలకు షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు.
అప్పటి జ్ఞాపకాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ... క్యాన్సర్ వ్యాధిని జయించడం కష్టం ఏమీ కాదు. అయితే ఆ సమయంలో చాలా ధైర్యంగా మనో నిబ్బరం గా ఉండాలి. చాలా మంది సానుభూతి చూపించేందుకు ప్రయత్నిస్తారు.. ఆ సానుభూతి అస్సలు పట్టించుకోవద్దు అంది.
తాను క్యాన్సర్ బారిన పడ్డ సమయంలో అందరికి దూరంగా వెళ్లి పోయాను. నేను ఎక్కడ ఉన్నాను అనేది కూడా ఎవరికి తెలియకుండా దూరంగా వెళ్లి పోయాను అంటూ చెప్పుకొచ్చింది. ఒంటరిగా ఆసుపత్రిలో చికిత్స పొందాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఆండగా ధైర్యంగా నిలిచారు అంది.
ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్న మమతా మోహన్ దాస్ ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా మోహన్ దాస్ కెరీర్ లో మళ్లీ బిజీ అవ్వాలని కోరుకుంటుంది. అనుకున్నట్లుగానే ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటుంది. త్వరలో టాలీవుడ్ సినిమాకు కూడా ఈమె ఓకే చెప్పే అవకాశాలు లేకపోలేదు.