బన్నీ-త్రివిక్రమ్ మధ్యలో మమ్ముట్టి అందుకేనా?
ఈ నేపథ్యంలో గురూజీ కాంపౌండ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నిరంగంలోకి దించాలని యోచన చేస్తున్నారట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాకి సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. బన్నీ`పుష్ప` నుంచి రిలీవ్ అయి సక్సెస్ని ఆస్వాదిస్తుంటే? గురూజీ మాత్రం తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని రెడీ అవుతున్నారు. దీనిలోభాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో గురూజీ కాంపౌండ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నిరంగంలోకి దించాలని యోచన చేస్తున్నారట. ఓ స్టార్ హీరో కోసం సినిమాలో ఓ బలమైన పాత్ర రాశారట. అదీ బన్నీ పాత్రకు ధీటుగా ఉంటుందట. పాత్రలో చిన్న పాటి నెగిటివ్ కోణం కూడా ఉంటుందని లీకులందుతున్నాయి. అయితే ఈ పాత్రను మమ్ముట్టిని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదట.
ఓ స్టార్ నటుడైతే బాగుంటుందని రాసిన రోల్ అట. మరి మమ్ముట్టినే దించడానికి కారణాలు ఏంటి? అంటే అక్కడ మార్కెట్ ని బేస్ చేసుకుని ఎన్ క్యాష్ చేసుకునే ఐడియాలో భాగంగా మమ్ముట్టిపేరు తెరపైకి వస్తోందంటున్నారు. మాలీవుడ్ లో ఐకాన్ స్టార్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అక్కడ భారీగా అభిమానులున్న స్టార్ బన్నీ. బన్నీ నటించిన ప్రతీ సినిమా మాలీవుడ్ మార్కెట్ లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. బాగుంటే అక్కడ నుంచి మంచి వసూళ్లు రాబడుతుంటాయి.
అయితే గురూజీ ఇప్పుడు బన్నీతో తీస్తోంది పాన్ ఇండియా చిత్రం. అలంటి చిత్రానికి బన్నీ మాలీవుడ్ మార్కెట్తో పాటు అదే భాషకు చెందిన మరో పేరున్న నటుడైతే వసూళ్లు అక్కడింకా అధికంగా వచ్చే అవకాశం ఉంటుందన్న ప్లానింగ్ లో భాగంగా మమ్ముట్టిని లైన్ లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్ లో మమ్ముట్టి మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు. అందుకే బన్నీ క్రేజ్ కి మమ్ముట్టి మాలీవుడ్ ఇమేజ్ కూడా తోడైతే అది వేరే లెవల్లో ఉంటుంది. 10 రూపాయలు వచ్చే చోట చోట ఒకేసారి 30 రూపాలయలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే గురూజీ ఇలా మమ్ముట్టిని సీన్ లోకి తెస్తున్నట్లు కనిపిస్తుంది.