హీరోయిన్ నోట చివాట్లు తిన్న స్టార్ హీరోలు!
ఇండస్ట్రీలో చక్రం తిప్పేది అంతా స్టార్ హీరోలే. దర్శక, నిర్మాతలు సైతం వాళ్ల మాటకు కట్టుబడి పని చేయాల్సిన పరిస్థితులు.
ఇండస్ట్రీలో చక్రం తిప్పేది అంతా స్టార్ హీరోలే. దర్శక, నిర్మాతలు సైతం వాళ్ల మాటకు కట్టుబడి పని చేయాల్సిన పరిస్థితులు. ఆన్ సెట్స్ లో అంతా దర్శకుడు చెప్పినట్లు చేయాలి. లేదంటే హీరో ఇష్ట ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. రెండో విధానం ఏ ఒక్క పరిశ్రమలోనే చెల్లుబాటులో లేదు. దాదాపు అన్ని పరిశ్రమల్లోనూ ఇలాగే ఉంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోయిన్ నోట ఇద్దరు స్టార్ హీరోలు చివాట్లు తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే ఇది ఈ నాటిది కాదు. కొన్ని దశాబ్దాల క్రితం నాటి స్టోరీ. మరి అలా చీవాట్లు తిన్న హీరోలు ఎవరు? ఎందుకు తినాల్సి వచ్చింది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వాళ్లెవరో కాదు సల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్. అవును వీళ్లిద్దరు కొన్నాళ్ల కిత్రం `కరణ్ అర్జున్` అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రాకేష్ రోషన్ తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో హీరోయిన్ గా మమతా కులకర్ణి నటించారు.
అయితే `బాంగ్డా పాలే` పాట షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్ ఇద్దరు ఆపాటలో వేయాల్సి డాన్సు మూవ్ మెంట్లు మర్చిపోయారుట. దీంతో మమతా కులకర్ణితో ఏమాత్రం కోఆర్డినేషన్ లేకుండా డాన్సు చేస్తున్నారుట. చాలాసేపు ఓపిక పట్టిన మమత చివరకు ఇద్దరి హీరోలపై మండిపడిందట. ఈ విషయాన్నిస్వయంగా షారుక్ ఖాన్ తాజాగా రివీల్ చేసారు.
`ఇప్పటివరకూ సెట్లో నన్ను, సల్మాన్ ఖాన్ ని ఎవరూ తిట్టలేదు. అలాంటి అనుభవం ఎప్పుడు చూడలేదు. ఆ ఛాన్స్ ఏ నటికి ఇవ్వలేదు. కానీ మమతా కులకర్ణి కొట్టేసింది. స్టెప్పులు మర్చిపోవడంతోనే మాకి పరిస్థితి ఎదురైంది. ఇద్దరు కలిసి పాటంతా పాడుచేస్తున్నారని అంది. ఆమె అలా అంటే ఇద్దరం పక్కన నిలబడి వేళ్లు చప్పరిస్తూ చూస్తున్నాం. తప్పు మాదే. స్టెప్పులు బాగా వేసేందుకు ఎక్కువ సార్లు రిహార్సల్స్ చేయమని సలహా ఇచ్చింది. ఆమె మమ్మల్ని తిట్టినా మళ్లీ మాతో మాట్లాడకుండా ఉండలేకపో యింది` అని తెలిపారు.