మంచు మనోజ్‌ కూతురు పేరులో ఏం ఉంది?

మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్‌ వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా వెండి తెరకు దూరం అయ్యాడు.

Update: 2024-07-08 07:39 GMT

మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్‌ వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా వెండి తెరకు దూరం అయ్యాడు. ఆయన అభిమానులు అయిదు ఏళ్లుగా సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినట్లు, షూటింగ్‌ ప్రారంభం అయినట్లుగా మనోజ్ ప్రకటించాడు.


త్వరలో మనోజ్ కొత్త సినిమా రావడం కన్ఫర్మ్‌ అయ్యింది. దాంతో పాటు ఆయన కూతురు ను కూడా రివీల్‌ చేయడం జరిగింది. కూతురు కు పేరు పెట్టి ఆ పేరును సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న మంచు మనోజ్ పేరు తో అందరి దృష్టిని ఆకర్షించాడు.


చాలా డెప్త్‌ ఉన్న పేరు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మరి కొందరు భలే ఆలోచించి పెట్టారే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు పేరు ఏంటి అంటే... దేవసేన శోభ ఎంఎం. ఈ పేరులో చాలా అర్థం ఉందని కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థం అవుతుంది.


దేవసేన అంటే సుబ్రమణ్యం స్వామి భార్య. శివ భక్తురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. అందుకే ఆమె పేరును మనోజ్ తన కూతురు కోసం ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత మనోజ్ భార్య అయిన మౌనిక తల్లి శోభ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శోభ నాగిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఆమె హఠాన్మరణం కుటుంబాన్ని విషాదంలో ముంచింది. తల్లి జ్ఞాపకార్థం కూతురుకు మౌనిక శోభ అని పెట్టుకుంది. ఇక ఎంఎం అంటే మౌనిక, మనోజ్‌, మంచు, మోహన్‌ బాబు ఇలా చాలా పేర్లే వస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవడమే అంటున్నారు. మొత్తానికి కూతురు కి భలే పేరు పెట్టారు మనోజ్ అండ్‌ మౌనిక.

Tags:    

Similar News