ఈ ఏడాది మేటి చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని మాత్రమే హిట్‌ గా సూపర్‌ హిట్ గా నిలిచాయి

Update: 2024-04-20 11:11 GMT
ఈ ఏడాది మేటి చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌
  • whatsapp icon

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని మాత్రమే హిట్‌ గా సూపర్‌ హిట్ గా నిలిచాయి. సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో మంజుమ్మల్‌ బాయ్స్ ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మలయాళం నుంచి వచ్చిన మంజుమ్మల్‌ బాయ్స్ సినిమా దేశ వ్యాప్తంగా సెన్షేషన్ క్రియేట్‌ చేసింది. విడుదల రోజు ఈ సినిమా గురించి పెద్దగా చర్చలేదు. కానీ రోజులు గడుస్తున్నా కొద్ది దేశ వ్యాప్తంగా ఈ బాయ్స్ గురించి చర్చ జరిగింది. సోషల్‌ మీడియా, టీవీ మీడియా ఇలా అన్ని చోట్ల కూడా మంజుమ్మల్‌ బాయ్స్ చర్చ.

తెలుగు తో పాటు తమిళం ఇంకా ఇతర భాషల్లో కూడా డబ్‌ అయిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ మిస్ అయిన వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

గత నెల రోజులుగా ఊరిస్తున్న మంజుమ్మల్‌ బాయ్స్ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ దక్కించుకుందట. తెలుగు వర్షన్ ను మే 3వ తారీకున స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్ధం అవుతుంది. భారీ మొత్తానికి మంజుమ్మల్‌ బాయ్స్ సినిమాను కొనుగోలు చేసిన డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ కి కచ్చితంగా మంచి ఫలితం దక్కడం ఖాయం.

చిదంబరం దర్శకత్వంలో రూపొందిన మంజుమ్మల్‌ బాయ్స్ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. యూత్‌ కి కనెక్ట్‌ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి మంచి ఆధరణ లభించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News