వీడియో: లాక్మే ఫ్యాష‌న్ వీక్‌లో మ‌ను భాక‌ర్ దుమారం

ఒలింపిక్ ఛాంపియన్ మను భాకర్ ప్ర‌తిభ‌తో పాటు అంద‌చందాలు యువ‌త‌రానికి గిలిగింత‌లు పెడతాయి.

Update: 2024-10-11 12:48 GMT

ఒలింపిక్ ఛాంపియన్ మను భాకర్ ప్ర‌తిభ‌తో పాటు అంద‌చందాలు యువ‌త‌రానికి గిలిగింత‌లు పెడతాయి. మ‌ను గ‌తంలో ర్యాంప్ వాక్ ల‌తో టాప్ మోడ‌ల్స్ ని త‌ల‌దన్నేలా క‌నిపించింది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లోను మ‌ను ర్యాంప్ వాక్ చేసిన‌ వీడియో వైరల్‌గా మారుతోంది. ఈ కార్యక్రమంలో షూటర్ మ‌ను భాక‌ర్ ఒక దుస్తుల కంపెనీకి ప్రాతినిధ్యం వహించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లలో రెండు కాంస్య పతకాలతో ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్‌గా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మ‌ను చరిత్ర సృష్టించారు.

ప్ర‌స్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మను భాకర్ ర్యాంప్ వాక్‌తో అదరగొట్టింది. లేడీ శ్రీ రామ్ కళాశాలలో ఇటీవల భారత క్రీడాకారిణి, షూటర్ మను భాకర్‌ను క్రీడలలో సాధించిన విజయాలకు గాను ఘ‌నంగా సత్కరించారు. ఈ కార్యక్రమం మ‌ను ప్రయాణం, అంకితభావాన్ని సెల‌బ్రేట్ చేసే ప్ర‌య‌త్నం. త‌న‌ స్ఫూర్తిదాయకమైన కథను వినేందుకు విద్యార్థులు, అధ్యాపకులు, క్రీడాభిమానులు తరలివచ్చారు. మ‌ను భాకర్ త‌న కెరీర్ జ‌ర్నీలో ఎదుర్కొన్న సవాళ్లు, క్రీడారంగంలో విజయం సాధించడానికి అవసరమైన కృషి గురించి మాట్లాడారు.

ఉన్నత విద్యా ప్రమాణాల కారణంగా లేడీ శ్రీ రామ్ కాలేజీలో చేరాల‌నే ఆలోచ‌న‌ తనకు ఎలాంటి డౌట్లు పెట్టిందో కూడా మ‌ను భాకర్ ఈ వేదిక‌పై వెల్ల‌డించారు. ఆమె కోచ్, జస్పాల్ సర్ త‌న‌ను అక్కడ చదువుకోమని ప్రోత్సహించారు. మొదట్లో సందేహించినా కానీ కళాశాల గురించి మరింత తెలుసుకున్న తర్వాత అక్క‌డ‌ చేరాలని నిర్ణయించుకుంది. కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మీనాక్షి మామ్‌(స్కూల్ టీచ‌ర్)ను కలిశారు. చదువులు, క్రీడలు బ్యాలెన్సింగ్‌గా సాగాలని తాను ఆందోళన చెందుతున్నప్పటికీ కళాశాలలో చదవాలనే కోరికను మ‌ను భాకర్ వ్యక్తం చేసింది. దీనికి మ్యాడమ్ థ్రిల్ అయ్యారు.

స్పోర్ట్స్ - స్టడీస్ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం మ‌ను భాకర్‌కి చాలా కష్టం. శిక్షణా సెషన్ల మధ్య తరగతులకు హాజరు కావడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేసింది. ఒకసారి శిక్షణ తర్వాత ఆలస్యంగా వచ్చినందున ఒక ఉపాధ్యాయుడు త‌న‌ను తరగతి గ‌దిలోకి అనుమతించలేదు. ఇది నాకు ప్రతి క్షణం ది బెస్ట్ అందించడం అనే ప్రాముఖ్యతను నేర్పిందని అథ్లెట్ మ‌ను భాక‌ర్ వెల్ల‌డించారు.

Tags:    

Similar News