సుధీర్ బాబు 'హరోం హర'.. ఈ ఓటీటీ ట్విస్ట్ ఏంటి?

సుధీర్ బాబు కెరీర్ లో మాత్రం హరోం హర.. గత చిత్రాలతో పోలిస్తే మంచి ఓపెనింగ్స్, వసూళ్లు సాధించింది.

Update: 2024-07-12 16:45 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో మూవీ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఆడియన్స్ లో భారీ హైప్ కూడా క్రియేట్ అయింది. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సుధీర్ బాబు కెరీర్ లో మాత్రం హరోం హర.. గత చిత్రాలతో పోలిస్తే మంచి ఓపెనింగ్స్, వసూళ్లు సాధించింది.

అయితే థియేటర్లలో మెప్పించలేకపోయిన పలు సినిమాలు.. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో హరోం హర మూవీని ఓటీటీలో చూద్దామని చాలా మంది అనుకున్నారు. సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్న ఓటీటీలు ఈటీవీ విన్, ఆహా.. హరోం హర మూవీ జులై 11వ తేదీన స్ట్రీమింగ్ చేస్తాయని అనౌన్స్మెంట్ ఇచ్చాయి. కానీ చెప్పినట్టు.. సినిమా అందుబాటులోకి రాలేదు. అందుకు కారణమిదేనని ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది.

తండ్రీకూతుళ్లకు చెందిన ఓ వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఇటీవల పోక్సో కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు రిమాండ్ లో ఉన్నాడు. అయితే ప్రణీత్ హనుమంతు హరోం హర మూవీలో ఓ చిన్న పాత్రలో నటించారు. అతని కోసం తెలియక.. సినిమాలో అవకాశం ఇచ్చామని సుధీర్ బాబు రీసెంట్ గా ట్వీట్ కూడా చేశారు. అతడు సినిమాలో నటించినందుకు అసహ్యంగా ఉందని చెప్పారు.

ఇప్పుడు ప్రణీత్ ఉన్న అన్ని సీన్లు కట్ చేసిన తర్వాతే.. హరోం హర ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వర్క్ ప్రస్తుతం జరుగుతోందని సమాచారం. త్వరలో రెండు ఓటీటీల్లో మూవీ స్ట్రీమింగ్ కానుందట. కొత్త స్ట్రీమింగ్ డేట్ ను రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేయనున్నారని వినికిడి. వచ్చే వారం.. ఓటీటీ లవర్స్ కు మూవీ అందుబాటులోకి రానుందని టాక్.

అయితే మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే మూవీలో ప్రణీత్ హనుమంతు ఉన్న సీన్స్ తొలగించకపోతే.. పరిస్థితి వేరేలా ఉంటుంది. అతడు ఉన్న సీన్స్.. కచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. దాని వల్ల సినిమా స్ట్రీమింగ్ పై ఎఫెక్ట్ పడుతుంది. చాలా మంది తప్పుడు కామెంట్స్ పెట్టే అవకాశం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొనే మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ స్ట్రీమింగ్ లేట్ అయినా.. తీసుకున్నది మాత్రం మంచి నిర్ణయమే!

Tags:    

Similar News