81లోనూ త‌గ్గేదేలే..వ‌స్తే రికార్డే!

ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వేడుక‌ల్లో ఉత్త‌మ ద‌ర్శ‌కుడి కేట‌గిరిలో నామినేట అయ్యారు మార్టిన్ స్కోర్సెస్

Update: 2024-03-09 05:38 GMT

ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి వ‌య‌సుతో సంబంధం లేదు. కృషి ప‌ట్టుద‌ల‌తో గ‌మ్యాన్ని చేరుకోవ‌డ‌మే టార్గెట్ గా పెట్టుకున్న‌ప్పుడు? వ‌య‌సుతో ప‌నేముంది. ల‌క్ష్యం చేరే వ‌ర‌కూ వ‌య‌స్సు అన్న‌ది గుర్తుకు రాకూడ‌ద‌ని మేధావులంతా చెప్పే మాట‌. ఒక్కోసారి ల‌క్ష్యం తొంద‌ర‌గా చేరుకోవ‌చ్చు. మ‌రికొన్ని సార్లు ఆల‌స్యం కావొచ్చు. కానీ అంతిమంగా గ‌మ్యాన్ని చేరామా? లేదా? అన్న‌దే ముఖ్యంగా తాజాగా 81 వ‌య‌సులోనూ ఆస్కార్ అందుకుంటాన‌నే ల‌క్ష్యంతా ముందుకు క‌దిలాడు ఓ హాలీవుడ్ మేక‌ర్.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వేడుక‌ల్లో ఉత్త‌మ ద‌ర్శ‌కుడి కేట‌గిరిలో నామినేట అయ్యారు మార్టిన్ స్కోర్సెస్. ఆయ‌న దర్శ‌క‌త్వంలో రూపొంది గ‌తేడాది రిలీజ్ అయిన 'కిల్ల‌ర్స్ ఆఫ్ ది ప్ల‌వ‌ర్ మూన్' చిత్రానికి గానూ అస్కార్ రేసులో నిలిచారు. ఇప్ప‌టికే ఈ సినిమా ప‌లు అంత‌ర్జాతీయ అవార్డులు ద‌క్కించుకుంది. దీంతో అస్కార్ ఖాయ‌మ‌నే అంచ‌నాలు బ‌లంగా ఏర్ప‌డుతున్నాయి. క‌నీసం నాలుగైదు విభాగాల నుంచి అస్కార్ వ‌రిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా క‌థ విష‌యాకి వ‌స్తే ఒసాజ్ ప్రాంతంలోని చ‌మురు సంప‌ద కోసం ఓ రాజ‌కీయ నాయ‌కుడు చేస్తున్న వ‌రుస హ‌త్య‌ల క‌థ‌నంతో త‌న‌దైన శైలిలో తెర‌క్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. 'హూజ్ ద‌ట్ నాకింగ్ ఎట్ మై డోర్' తో మార్టిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత 'టాక్సీ డ్రైవ‌ర్'.. 'ది ఐరీష్ మ్యాన్'.. 'సైలెన్స్' లాంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కించారు.

హాలీవుడ్ లో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నారు. 'ది డాప‌ర్టెడ్' చిత్రానికి గానూ 2004 లో అకాడ‌మీ అవార్డు కూడా అందుకున్నారు. నాలుగు బాప్టా అవార్డుల‌ను..గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాలు ద‌క్కించుకు న్నారు. మ‌రి ఇప్పుడు ఆస్కార్ వేదికపై మెరుస్తారా? లేదా? అన్న‌ది చూడాలి. ఈ ఏడాది ఉత్త‌మ ద‌ర్శ‌కుల విభాగం నుంచి పోటీ గ‌ట్టిగానే ఉంది.

Tags:    

Similar News