గుంటూరు రాజీ భలే బిజీబిజీ

అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో ఇండియా కి ప్రాతినిధ్యం వహించిన ఈ అమ్మడు రన్నపర్ గా నిలిచింది.

Update: 2024-07-23 08:30 GMT

ఫెమినా మిస్‌ ఇండియా 2018 పోటీలలో హర్యానా నుంచి ప్రాతినిధ్యం వహించిన మీనాక్షి చౌదరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో ఇండియా కి ప్రాతినిధ్యం వహించిన ఈ అమ్మడు రన్నపర్ గా నిలిచింది. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత మీనాక్షి చౌదరి కి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

2021 లో ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. మొదటి సినిమాతో నిరాశ పరిచిన కూడా ప్రముఖుల దృష్టిలో పడటంలో సఫలం అయింది. ముఖ్యంగా స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈమెకి ఆఫర్ ఇస్తానంటూ గతంలో ప్రకటించాడు. అన్నట్లుగానే గుంటూరు కారం సినిమాలో రాజీ పాత్రను ఇచ్చాడు.

గుంటూరు కారం సినిమాలో ప్రాముఖ్యత లేని పాత్ర అంటూ కొందరు విమర్శించినా కూడా దాని వల్ల వచ్చిన పాపులారిటీ కారణంగా వరుసగా సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగు లో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.

చిరు మూవీ కాకుండా విశ్వక్‌సేన్‌ హీరోగా రూపొందుతున్న మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమాలను చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న గోట్‌ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. రాబోయే రెండేళ్ల కాలంలో మీనాక్షి చౌదరి నటించిన పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కారం నిరాశ పరిచిన గుంటూరు రాజీ మాత్రం భలే బిజీ బిజీ అని ఆమె సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News