SVC58: గన్నుతో గులాబీ లాంటి అమ్మాయి

మెయిన్ హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ ఎంపిక చేయాలని చూస్తున్నారని సమాచారం.

Update: 2024-07-02 15:42 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న "SVC58" ప్రాజెక్టు షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియం రేంజ్ బడ్జెట్‌లో టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. మెయిన్ హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ ఎంపిక చేయాలని చూస్తున్నారని సమాచారం.

"SVC58" చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్‌లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, భార్య మధ్యలో కథ నడుస్తుందట. మల్టీ స్టారర్‌గా ఉండబోతుందని కూడా వార్తలు వచ్చాయి, అయితే ఈ చిత్రంలో వెంకటేష్ సోలో హీరోగానే కనిపించనున్నారు. కాకపోతే మరో హీరో స్పెషల్ రోల్ చేస్తారనే టాక్ ప్రచారంలో ఉంది.

ఇక వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో "ఎఫ్2", "ఎఫ్3" మల్టీ స్టారర్ చిత్రాలు పెద్ద సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు "వెంకీ 76"తో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని టీమ్ సీరియస్‌గా కసరత్తులు చేస్తోంది. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని సమాచారం. ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి.

Read more!

ఇక ఇక లేటెస్ట్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరి లుక్ రివీల్ చేశారు. అందులో ఆమె గన్ను పట్టుకొని కనిపిస్తోంది. అందమైన అమ్మాయి అలా గన్ను పట్టుకొని కనిపిస్తోంది అంటే ఆమె అతని ప్రేయసి అని అర్ధమవుతుంది. ఇక సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని రివీల్ చేశారు. యాక్షన్ డోస్ కూడా ఆమె క్యారెక్టర్ లో గట్టిగానే ఉంటుందని అర్ధమవుతుంది. ఇక సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం రోజు జరగనున్నాయి.

ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సొంతూరుకు సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్‌ను కూడా హైలెట్ చేయనున్నట్లు సమాచారం. సంక్రాంతికి పక్కా హిట్ బొమ్మగా ఈ మూవీ కథను అనిల్ రావిపూడి సిద్ధం చేశారట. విక్టరీ వెంకటేష్ చివరిగా "సైంధవ్" మూవీలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, అనిల్ రావిపూడి రూపొందించిన సినిమాలు అన్ని కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో "వెంకీ 76" మూవీ కూడా కచ్చితంగా హిట్ బొమ్మగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అందించనున్నాడు.

Tags:    

Similar News

eac