పవన్ హీరోయిన్ పెళ్లికి గ్లోబల్ స్టార్‌ని పిలవదట
మీరా చోప్రా తన కజిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఆమె భర్త, గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహానికి ఆహ్వానిస్తున్నారా? అని ప్రశ్నించగా ''నిజానికి మేం ఆహ్వానిస్తాం.
పవన్ కల్యాణ్ 'బంగారం' ఫేం మీరా చోప్రా పెళ్లికి సిద్ధమైంది. తాజా మీడియా ఇంటర్వ్యూలో మీరా తన వివాహం మార్చిలో జరుగుతుందని వెల్లడించింది. వరుడు గురించిన వివరాలను గోప్యంగా ఉంచిన మీరా 'అతడు ఒక మంచి అబ్బాయి' అని మాత్రం పేర్కొంది. ఇది క్లాసిక్ హిందూ వివాహ వేడుక అని వెల్లడించింది. ముంబైలో ఎలాంటి ఫంక్షన్లు ఉండవని, అయితే రాజస్థాన్‌లో జరిగే వేడుకలకు అందరూ హాజరు కావాలని తాను యోచిస్తున్నట్లు తెలిపింది. మీరా చోప్రా తన కజిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఆమె భర్త, గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహానికి ఆహ్వానిస్తున్నారా? అని ప్రశ్నించగా ''నిజానికి మేం ఆహ్వానిస్తాం. అగర్ ఫ్రీ హాంగే, టు అయేంగే (వారు ఖాళీగా ఉంటే వస్తారు)'' అని గుంబనగా వ్యాఖ్యానించింది.
మీరా చోప్రా ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా కజిన్ అయిన సుదేష్ చోప్రా కుమార్తె. నెపో సహకారం తనకు ఏవిధంగాను అక్కరకు రాలేదని మీరా గతంలో తెలిపింది. తనకు తన సోదరి ప్రియాంక చోప్రా సహకారం పరిశ్రమలో ఏవిధంగాను ఉపకరించలేదని అంది. నేను సినీ ఫీల్డ్ తో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వస్తున్నానని తెలిసి వాళ్లు(దర్శకనిర్మాతలు) నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అది నాకు లభించిన ఏకైక ప్రత్యేకత. అందుకే నేను చాలా కష్టపడాల్సి వచ్చింది! అని మీరా చోప్రా పేర్కొంది. అయితే ప్రియాంక చోప్రా కజిన్ అని తెలియడంతో అందరి ఫోకస్ తనపై ఉండేదని వెల్లడించింది.
ఇటీవలి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో మీరా చోప్రా తన సోదరీమణులైన ప్రియాంక చోప్రా - పరిణీతి చోప్రాతో అంతగా అనుబంధం లేకపోవడం గురించి ఓపెనైంది. మీరా చోప్రా మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా- పరిణీతి చోప్రాతో స్నేహం లేదా గొప్పగా చెప్పుకోవడం కపటత్వం (అబద్ధం) అవుతుందని అంది. కెరీర్ ప్రారంభరోజుల్లో పరిశ్రమలో వారి మద్దతు ఉంటుందనే అంచనాలు ఉన్నా కానీ... తనకు వారి నుంచి ఎలాంటి సహకారం అందలేదని మీరా చెప్పింది. తన కజిన్‌లను ఎలాంటి సహాయం కోరలేదని... వారు ఎలాంటి సహాయం అందించలేదని కూడా పేర్కొంది. తాను సహాయం కోరే వ్యక్తిని కాదని మీరా చోప్రా పేర్కొంది.
అయితే ప్రియాంక చోప్రా-పరిణీతితో కలిసి మన్నారా- మీరా చోప్రా కూడా ఒకే ఇంట్లో ఉండేవారట. వారంతా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంగా, ఒకే ఇంట్లో ఉండేవాళ్లమని కూడా మీరా గుర్తు చేసుకున్నారు. కానీ ఇంట్లో ఎవరైనా (పీసీ) అపారమైన విజయాన్ని సాధించినప్పుడు ఇతరులకు సహజంగానే గుర్తింపు తక్కువగా ఉంటుంది... అని మీరా చోప్రా అన్నారు.
మీరా చోప్రా చివరిసారిగా జీ5 చిత్రం సఫెద్‌లో కనిపించింది. బర్ఖా బిష్త్, ఛాయా కదమ్, జమీల్ ఖాన్‌లతో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకుంటోంది. దీనికి ముందు అజయ్ బహ్ల్ సెక్షన్ 375 లో మీరా నటించింది.