చ‌ర‌ణ్ హీరోయిన్ ఛాన్స్ చిరంజీవి తీసుకున్నారా?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రానికి హీరోయిన్ గా జాన్వీక‌పూర్ ని ఫైన‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే

Update: 2024-03-07 08:11 GMT

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రానికి హీరోయిన్ గా జాన్వీక‌పూర్ ని ఫైన‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. జాన్వీ డెబ్యూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `దేవ‌ర‌`తో షురూ చేయ‌గా ..రెండ‌వ చిత్రం రామ్ చ‌ర‌ణ్ తో ఛాన్స్ రావ‌డంతో అమ్మ‌డి ఆనందానికి అవ‌దుల్లేవ్. చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పాన్ ఇండియాని షేక్ చేయ‌డానికి ఈ కాంబినేష‌న్ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఇక చ‌ర‌ణ్ కి హీరోయిన్ గా ఎవ‌ర్ని ఎంపిక చేయాలి? అన్న అంశంపై పెద్ద‌గా చ‌ర్చ అంటూ సాగ‌లేదు. జాన్వీక‌పూర్ పేరే ఎక్కువ‌గా తెర‌పైకి వ‌చ్చింది. చివ‌రిగా ఆమెనే ఎంపిక చేసి అభిమానుల కోరిక కూడా నెర వేర్చారు. మ‌రిజాన్వీ ఎంట్రీ వెనుక కీల‌క పాత్ర పోషించింది ఎవ‌రు? హీరో రామ్ చ‌ర‌ణ్ నా? ద‌ర్శ‌కుడు బుచ్చిబాబునా? అంటే ఆ ఇద్ద‌రు కాద‌ని తెలుస్తోంది. జాన్వీ ఈ ప్రాజెక్ట్ లోకి రావ‌డానికి అస‌లు కార‌ణం మెగాస్టార్ చిరంజీవి అట‌.

చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీ అయితే బాగుంటుంద‌ని..అలాగే బుచ్చిబాబు రాసుకున్న పాత్ర‌కు కూడా ప‌క్కాగా జాన్వీ అయితే యాప్ట్ అవుతుంద‌ని ఆమెని తీసుకోండని చిరంజీవి స‌ల‌హా ఇచ్చారుట‌. దీంతో చ‌ర‌ణ్‌.. బుచ్చిబాబు మ‌రో ఆలోచ‌న లేకుండా జాన్వీనే ఫైన‌ల్ చేద్దామ‌ని ఓ మాట అనుకుని అప్రోచ్ అయ్యారుట‌. ఆమెని సంప్ర‌దించ‌డం..పాత్ర స‌హా చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌క‌పో వ‌డంతో ప్రాజెక్ట్ లోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇక చ‌ర‌ణ్‌-జాన్వీకి ఒకే ప్రేమ్ లో చూడాల‌ని చిరంజీవి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. జాన్వీ త‌ల్లి శ్రీదేవితో చిరంజీవి క‌లిసి న‌టించారు. అనాటి చిరంజీవి హీరోయిన్ కుమార్తెతో త‌న కుమారుడు కూడా న‌టించాలి గా అన్న సంక‌ల్పంతో తొలి సినిమానే చ‌ర‌ణ్ తో చేయిస్తే బాగుంటుంద‌ని చిరంజీవి అనుకున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. కానీ ఆ ఛాన్స్ తార‌క్ త‌న్నుకుపోవ‌డంతో వీలుప‌డ‌లేదు. దీంతో ఎలాగైనా రెండ‌వ సినిమా అయినా చ‌ర‌ణ్ స‌ర‌స‌న చేయిస్తే బాగుంటుంద‌ని చిరంజీవి న‌డుంబిగిం చ‌డంతోనే ఇది సాధ్య‌మైన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News