156 కోసం మెగాస్టార్ ఇంకా బాండ్ కాలేదా?
మరి మెగాస్టార్ ఇంకా ఆ సినిమా షూట్ లో పూర్తిగా బాండ్ కాలేదా? పాక్షికంగానే సెట్స్ కి హాజరవుతున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 156వ చిత్రం 'బింబిసార` ఫేం వశిష్ట దర్శకత్వంలో ప్రారంభమ వ్వడం...మారుడుమిల్లిలో రెగ్యులర్ షూటింగ్ షురూ అవ్వడం తెలిసిందే. తొలుత అక్కడ చిరంజీవి లేకుండానే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అటుపై కొన్ని రోజులకి మెగాస్టార్ టీమ్ తో జాయిన్ అయ్యారు. ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మరి మెగాస్టార్ ఇంకా ఆ సినిమా షూట్ లో పూర్తిగా బాండ్ కాలేదా? పాక్షికంగానే సెట్స్ కి హాజరవుతున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి.
మెగాస్టార్ ఇంకా పూర్తిగా 156 షూట్ లో పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదని తాజాగా లీక్ అవుతోంది. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఏ కారణంతో మెగాస్టార్ వందశాతం ఎపెర్ట్ పెట్టడం లేదు? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. రెండు..మూడు నెలల క్రితం చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అటుపై శస్త్రచికిత్స కోసం భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లినట్లు వినిపించింది.
ఆ తర్వాత ఆయన కోలుకోవడం...యధావిధిగా మళ్లీ సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ తాజా సమాచారం మేరకు ఆయన ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలే దని వినిపిస్తుంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం ఈవెంట్ కి మెగాస్టార్ అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఎక్కువ సేపు నిలబడలేదు. అంతా స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నా ఆయన మాత్రం చాలా సేపు కూర్చునే ఉన్నారు.
మెకాలి నొప్పి కారణంగానే ఆయన అంత సేపు కూర్చున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ నిలబడి చాలా సేపు మాట్లాడినా చిరు మాత్రం నుంచి తర్వాత కూర్చున్నారు. దీంతో ఆయన నోప్పి కారణంగా అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి ఇంకా కాలి నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు లేదని వినిపి స్తుంది. 156వ సినిమా షూటింగ్ లో కూడా కేవలం కొన్ని రోజుల పాటే తేలిక పాటి సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. పూర్తిగా కోలుకోవడానికి పెద్దగా సమయం కూడా పట్టదని తెలుస్తుంది. త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ కి చిరంజీవి పూర్తి స్థాయిలో సిద్దమవ్వడానికి అవకాశం ఉంటుందని వినిపిస్తుంది.