.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

లెజెండ‌రీ డ్యాన్సింగ్ స్టార్‌ మ‌ర‌ణానికి ముందు 3700 కోట్ల అప్పు

అత‌డు స్టెప్పేస్తే గ‌గ్గోలే..! ఆ శ‌రీర‌క‌ద‌లిక‌ల్లో క్లాస్ అప్పీల్.. ల‌య‌బ‌ద్ధ‌మైన డ్యాన్స్.. మెరుపుతీగ‌లాగా క‌దిలే శ‌రీరం వేగం.. వెర‌సి అత‌డి షోలంటే ప‌డి చ‌చ్చే ఫ్యాన్సున్నారు

Update: 2024-06-30 16:30 GMT

అత‌డు స్టెప్పేస్తే గ‌గ్గోలే..! ఆ శ‌రీర‌క‌ద‌లిక‌ల్లో క్లాస్ అప్పీల్.. ల‌య‌బ‌ద్ధ‌మైన డ్యాన్స్.. మెరుపుతీగ‌లాగా క‌దిలే శ‌రీరం వేగం.. వెర‌సి అత‌డి షోలంటే ప‌డి చ‌చ్చే ఫ్యాన్సున్నారు. వేదిక క‌దిలిపోతోందా లేక భూమి కంపిస్తోందా? అనేంత‌గా అభిమానులు మైమ‌రిచి వీల‌లు వేస్తూ గోల చేస్తూ.. వెర్రితల‌లు వేసే వేదిక‌ల‌ను ఈ సృజ‌కుడి వ‌ల్ల చూడ‌గ‌లిగింది ప్ర‌పంచం. వ‌ర‌ల్డ్ వైడ్ అసాధార‌ణ‌ ఫాలోయింగ్ ఉన్న మేటి డ్యాన్సింగ్ స్టార్ గా, పాప్ స్టార్ గా అత‌డు కొన్ని ద‌శాబ్ధా పాటు ఏలాడు. `కింగ్ ఆఫ్ పాప్`గా పాపుల‌రైన అత‌డు మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ లెజెండ్ మైఖేల్ జాక్స‌న్.

అయితే పాప్ ప్ర‌పంచపు రారాజు దివికేగి కొన్ని సంవ‌త్స‌రాలైన త‌ర్వాత ఇప్పుడు ఒక నిర్ఘాంత‌పోయే నిజం తెలిసింది. అత‌డికి అప్పులు ఉన్నాయి అని తెలుసుకానీ .. ఏకంగా 3700 కోట్ల అప్పు ఉంద‌ని తెలిసి ఔరా! అంటూ షాక్ తింటున్నారు. మైఖేల్ జాక్సన్ మరణానికి ముందు రూ. 3700 కోట్లకు పైగా అప్పుల్లో మునిగి ఉన్నాడ‌ని ప్ర‌ఖ్యాత హాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఇందులో షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. 2009లో మైకేల్ జాక్సన్ మ‌ర‌ణించారు. NBC న్యూస్ నివేదిక‌ ప్రకారం.. దివంగత పాప్ గాయకుడి ఎస్టేట్ కార్యనిర్వాహకులు ఇటీవల లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిలో వారు పాప్ కింగ్ రుణాన్ని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. 500 మిలియన్ డాల‌ర్ల‌ కంటే ఎక్కువ అప్పులున్నాయ‌ని నివేదించారు. దీని విలువ భార‌తీయ క‌రెన్సీలో దాదాపు రూ.3700 కోట్లు.

Read more!

మైఖేల్ జాక్సన్ మరణించిన సమయంలో జాక్సన్ అత్యంత ముఖ్యమైన ఆస్తులు $500 మిలియన్లకు పైగా రుణాలు .. రుణదాతల క్లెయిమ్‌లకు లోబడి ఉన్నాయి. కొన్ని అప్పులు అధిక వడ్డీ రేట్లకు తీసుకోగా వడ్డీని చెల్లిస్తున్నారు. కొన్ని అప్పులు డిఫాల్ట్‌లో ఉన్నాయి! అని పిటిషన్‌లో పేర్కొన్న‌ట్టు తెలిసింది.

జాక్సన్ ముగ్గురు పిల్లలు - పారిస్, ప్రిన్స్, బిగి .. అతడి తల్లి కేథరీన్ .. దివంగత మైఖేల్ జాక్స‌న్ ట్రస్ట్ నుండి నిధులు పొందలేరని క‌థ‌నాలు వ‌చ్చిన కొన్ని రోజుల తర్వాత దిగ్భ్రాంతికరమైన అప్పుకు సంబంధించిన‌ వివరాలు వెలువడ్డాయి. అతడి ఎస్టేట్ ..IRS (ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్) మధ్య వివాదం పరిష్కరించుకునే వరకు వారు డబ్బు తీసుకునే వెసులుబాటు లేకుండా నిలుపుద‌ల చేసారు. అయితే మైఖేల్ జాక్సన్ కుటుంబ సభ్యులు తాము ఇప్పటికీ భత్యం ద్వారా చెల్లింపులు పొందుతున్నామని స్పష్టం చేయడానికి ఒక ప్రకటనను విడుదల చేశారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న ప్రొబేట్ కోర్టుకు అందించిన వార్షిక నివేదికలలో మైఖేల్ తల్లి , పిల్లలకు మద్దతు ఇవ్వడానికి ఎస్టేట్ చాలా గణనీయమైన మొత్తంలో డబ్బును అందజేస్తుందని ఆ ప్రకటనలో ప్ర‌చురించారు.

మైఖేల్ పిల్లలతో ఎస్టేట్ చాలా ద‌గ్గ‌ర‌ సంబంధాన్ని కలిగి ఉంది. వారికి ఏదైనా అవసరమైనప్పుడు మైఖేల్ కోరుకున్నట్లుగానే వారు చాలా బాగా చూసుకునేలా ఎస్టేట్ వారితో కలిసి పని చేస్తుంది! అని నివేదిక‌లో వెల్ల‌డించారు. IRS ఫెడరల్ ఎస్టేట్ టాక్స్ రిటర్న్‌ను పరిశీలించి, లేట్ పాప్ ఐకాన్ మైఖేల్ జాక్స‌న్ ఎస్టేట్‌కు లోపానికి సంబంధించిన నోట్‌ని జారీ చేయడంతో మైఖేల్ జాక్సన్ ఆర్థిక వివరాలు, అతడి నమ్మకానికి సంబంధించిన చట్టపరమైన వివాదం మొదలైంది. ఎస్టేట్ తన ఆస్తులను తక్కువగా అంచనా వేసింది.. పన్నులు - జరిమానాలలో అదనంగా 700 మిలియన్ల డాల‌ర్లు బకాయిపడిందని ఆరోపించింది.

2021లో ఎస్టేట్ ఈ ఆరోపణలను సవాలు చేసింది. కోర్టులో విచారణను గెలుచుకుంది. తరువాత ఎస్టేట్ మైజాక్ (సోనీ మ్యూజిక్ యాజమాన్యంలోని మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ కేటలాగ్) కోర్టు విలువకు సంబంధించి పునఃపరిశీలన కోసం మోషన్‌ను కూడా దాఖలు చేసింది. ఇది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.

మైఖేల్ జాక్సన్ పాపుల‌ర్ అమెరికన్ గాయకుడు.. పాటల రచయిత.. డ్యాన్స‌ర్ .. పరోపకారి. `కింగ్ ఆఫ్ పాప్` అని అత‌డిని అభిమానంగా పిలుచుకుంటారు. అత‌డు ప్రపంచవ్యాప్తంగా ప్రేమ‌ను అందుకున్నాడు. జాక్స‌న్ 25 జూన్ 2009న మరణించాడు. `దిస్ ఈజ్ ఇట్` ప‌ర్య‌ట‌న‌కు ముందు అత‌డు మ‌ర‌ణించ‌డంతో అభిమానులు ఆ వార్త‌ల్ని జీర్ణించుకోలేక‌పోయారు.

Tags:    

Similar News