ఏయన్నార్ ఒక పాఠ్య పుస్తకం : మోహన్ బాబు
ఇక ఇదే వేడుకలో ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. ఏఎన్నార్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చని.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు మోహన్ బాబు. షూటింగ్ స్పాట్ అయినా.. సినిమా మీటింగ్ అయినా.. ఏదైనా కార్యక్రమం అయినా ఆయన ఉన్నారు అంటే అక్కడ చుట్టుపక్కల అంతా క్రమశిక్షణగా ఉండాలని అనుకుంటారు. ఒకవేళ అది తప్పితే ఆయన ఆగ్రహానికి గురవ్వాల్సిందే. నేడు ఏఎన్నార్ శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగగా ఆ వేడుకలకు మోహన్ బాబు అటెండ్ అయ్యారు. వేడుక జరుగుతున్న టైం లో మోహన్ బాబు పక్కన జయసుధ కూర్చున్నారు. అయితే అతిథులు చెబుతున్న స్పీచ్ ను వినకుండా జయసుధ ఫోన్ చూస్తున్నారు.
ఆ టైం లో మోహన్ బాబు ఈ టైం లో ఫోన్ చూడటం ఏంటని అన్నట్టుగా జయసుధ ఫోన్ లాక్కోబోయారు. అయితే వెంటనే జయసుధ అలర్ట్ అయ్యి నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సెలబ్రిటీస్ వీడియో ఏదైనా బయటకు వస్తే దాని గురించి భిన్న రకాల అభిప్రాయాలు తెలపడం కామనే కదా. అక్కడ జరుగుతున్న వేడుక మీద పెట్టాల్సిన శ్రద్ధ ఫోన్ మీద ఎందుకని కొందరు అంటుంటే.. మోహన్ బాబు చేసింది కరెక్ట్ అంటూ మరికొందరు అంటున్నారు.
ఇక ఇదే వేడుకలో ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. ఏఎన్నార్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చని.. ఆయన సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంటే చొక్కా చించుకుని మరీ వెళ్లేవాడిని.. మళ్లీ ఆ చొక్కా కొనడానికి డబ్బులు ఉండేవి కాదని అన్నారు మోహన్ బాబు. అలాంటి మహా నటుడు నటించిన మరపురాని మనిషి సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను.. అది భగవంతుడి ఆశీర్వాదమని అన్నారు.
నటుడిగా మారాక ఆయన బ్యానర్ లో ఎన్నో సినిమాల్లో నటించాను. నాగేశ్వర రావు అన్నపూర్ణమ్మ పక్కపక్కనే కూర్చున్నప్పుడు తాను వెళ్లగా ఆమె తను ఫలానా సినిమాలో బాగా నటించావని ఆశీర్వదించారని అయితే అది చూసి ఏఎన్నార్ వాడేమైనా గొప్ప నటుడని ఫీలవుతున్నావా..? వాడికి ముందే పొగరు.. ఎందుకు వాడి గురించి పొగుడుతున్నావని ఆమెపై కసురుకున్నారని చెప్పారు మోహన్ బాబు.
ఆ తర్వాత రోజు సెట్ కు లేట్ గా వెళ్తే అప్పుడు ఒక విషయం చెప్పారు. నాకు ఒక కోరిక ఉంది సార్ ప్రతిసారి మీరొస్తే మేము నిలబడటమేనా నేను వచ్చినప్పుడు మీరు నిలబడాలని కోరుకుంటున్నా అన్నానని.. తర్వాత రోజు సెట్ లో దాసరి, ఏఎన్నార్ ఇద్దరు నా కోరిక తీర్చేందుకు లేచి నిలబడ్డారని అన్నారు మోహన్ బాబు. ఇలా ఏఎన్నార్ తో తనకు చాలా సరదా అనుభూతులు ఉన్నాయి. ఏఎన్నార్ ఒక గ్రంథం, ఒక పాఠ్య పుస్తకం అలాంటి గొప్ప వ్యక్తితో అనుబంధం ఉండటం సంతోషంగా ఉందని అన్నారు మోహన్ బాబు.