చివరి నిమిషంలో సూపర్ స్టార్‌కి సోలో రిలీజ్
కానీ ఒక రోజు ముందుగానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఎల్ 2 సినిమాతో పాటు విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర సూరన్ సినిమా సైతం విడుదలకు సిద్ధం అయ్యాయి.;

ఉగాది, రంజాన్ ఒకేసారి వస్తున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ వస్తుంది. దాంతో పెద్ద సినిమాలు ఐపీఎల్ ఉన్నప్పటికీ టెన్షన్ లేకుండా రిలీజ్‌కి సిద్ధం అయ్యాయి. సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతూ ఉంటాయి. కానీ ఒక రోజు ముందుగానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఎల్ 2 సినిమాతో పాటు విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర సూరన్ సినిమా సైతం విడుదలకు సిద్ధం అయ్యాయి. ఎల్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కానీ వీర ధీర సూరన్ గురువారం ఉదయం 11 గంటలు అయినా షో పడలేదు. చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల కారణంగా సినిమా షో పడలేదు.
విక్రమ్ నటించిన 'వీర ధీర సూరన్' సినిమా గురువారమే ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విశ్వాసంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా సినిమాను నేడే విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడులో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆ సినిమా విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు బుకింగ్ ప్రారంభం కాలేదు, ఇక మీదట ప్రారంభం అవుతాయా అంటే అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ గురువారం సూపర్ స్టార్ మోహన్ లాల్ 'ఎల్ 2' సినిమానే సింగిల్‌గా రూల్ చేయబోతుంది.
రేపు ఎలాగూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్ సినిమాలు రాబోతున్నాయి. ఆ రెండు సినిమాలకు పాజిటివ్ బజ్ ఉంది. కనుక ఎల్ 2 సినిమా ఏ మేరకు శుక్రవారం నిలుస్తుంది అనేది చూడాలి. నేడు ఎలాగూ సోలో రిలీజ్ దక్కింది. కనుక పాజిటివ్ రెస్పాన్స్ దక్కితే తెలుగు రాష్ట్రాల్లో మినిమం వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాల్లో ఒక మోస్తరు బుకింగ్ నమోదు కాగా, రూరల్ ఏరియాల్లో మొదటి షో కు పెద్దగా టికెట్లు బుక్ కాలేదు. దాంతో పలు చోట్ల షో లు క్యాన్సల్ అయ్యాయి. అయినా కూడా ఎల్ 2 కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సాయంత్రంకు టికెట్ల బుకింగ్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన 'లూసీఫర్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తెలుగులో లూసిఫర్ ను చిరంజీవి రీమేక్ చేశారు. కానీ ఎల్ 2 ను రీమేక్ చేసే ఉద్దేశం లేకపోవడంతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఎల్ 2 సినిమా ప్రమోషన్ కోసం మోహన్ లాల్, పృథ్వీ రాజ్ సుకుమారన్ హైదరాబాద్ వచ్చారు. మీడియాతో ఇంట్రాక్ట్ కావడంతో పాటు, అభిమానులతోనూ సందడి చేశారు. సినిమాకు దక్కిన ప్రీ రిలీజ్ బజ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ బుకింగ్ నమోదు అయ్యాయి. ఈ సినిమా లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు దక్కించుకోవాలంటే రేపు విడుదల కానున్న మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్ సినిమాలను తట్టుకోవాల్సి ఉంటుంది. వీర ధీర సూరన్ తో గట్టి పోటీ ఉంటుంది అనుకుంటే ఆ సినిమా దాదాపుగా తప్పుకోవడంతో ఎల్ 2 కి సోలో రిలీజ్ దొరికింది... మరి ఎల్ 2 ఈ తెలుగు సినిమాలను ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి.