కాంతార 2.. రంగంలోకి మరో పెద్ద స్టార్ ?

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రిషబ్ శెట్టి మోహన్ లాల్ ని మీట్ అయ్యారు.

Update: 2024-04-19 13:23 GMT

రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ కాంతార. ఈ సినిమా కన్నడంలో ముందుగా రిలీజ్ అయ్యి 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. తరువాత ఇతర భాషలలోకి డబ్బింగ్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కూడా కాంతార మూవీ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. అలాగే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల వరకు కాంతారా సినిమా వసూళ్లు చేసింది.

 

కేవలం 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమాతో హోంబలే ఫిలిమ్స్ భారీ లాభాలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్ సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలో నటిస్తోంది. కాంతారకి ముందు జరిగిన కథగా ఈ ఈ సినిమా రాబోతోంది.

గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రిషబ్ శెట్టి మోహన్ లాల్ ని మీట్ అయ్యారు. వీటికి సంబందించిన ఫోటోలని రిషబ్ శెట్టి ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. దీంతో మోహన్ లాల్ ఈ సినిమాలో నటిస్తున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.

అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ని రిషబ్ శెట్టి కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారంట. టాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ నటుడిని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారంట. గెస్ట్ అప్పీరియన్స్ ఉన్న పాత్రలు అయిన కూడా అన్ని భాషలలో పేరున్న నటులని తీసుకుంటే మూవీకి బిజినెస్ పరంగా కలిస్తోస్తుందని రిషబ్ శెట్టి ఇలా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో కాంతారలో ఉండే యాక్టర్స్ ఎవరూ కూడా ఉండరని తెలుస్తోంది. ప్రీక్వెల్ కథ కావడంతో పీరియాడికల్ జోనర్ లో మూవీ ఉండబోతోంది. దానికి తగ్గట్లుగానే నటీనటులని ఎంపిక చేసుకుంటున్నారంట. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కాంతార2పై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. మరి రిషబ్ శెట్టి ఈ కథతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.

Tags:    

Similar News