దర్శకుడు కుదరకే మోక్షజ్ఞ డెబ్యూ వాయిదా?
నిజానికి ఐదారేళ్ల క్రితమే మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని ఎన్బీకే ప్రచార టీమ్ లీకులిచ్చింది. అప్పట్లోనే మోక్షజ్ఞ డెబ్యూ ఇచ్చేస్తున్నాడంటూ బోలెడంత ప్రచారం సాగింది.
నటసింహా నందమూరి బాలకృష్ణ తాజా ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి ఇది నెటిజనుల్లో డిబేట్ కి తెర తీసింది. టాలీవుడ్ లో అసలు సిసలైన నందమూరి లెగసీని ముందుకు నడిపించేందుకు ఎవరు వస్తున్నారు? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు సమాధానం లేదు. ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రమే అభిమానులు భావిస్తున్నా.. నటసింహం మాత్రం మోక్షజ్ఞతో దీనిని ఫుల్ ఫిల్ చేయాలని కలలుగంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ స్పందన చూస్తుంటే మోక్షజ్ఞ కోసం దర్శకుడు లభించకపోవడం వల్లనే ఇంకా డెబ్యూ ఇవ్వలేదని భావించాల్సి వస్తోందని సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది.
నిజానికి ఐదారేళ్ల క్రితమే మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని ఎన్బీకే ప్రచార టీమ్ లీకులిచ్చింది. అప్పట్లోనే మోక్షజ్ఞ డెబ్యూ ఇచ్చేస్తున్నాడంటూ బోలెడంత ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత అతడు అందుకు సిద్ధంగా లేడని ..నటనలోకి రావడం మోక్షజ్ఞకు ఆసక్తి లేదని కూడా ప్రచారం సాగింది. దానికి ఉదాహరణగా అసలు ప్రిపరేషన్ లేని మోక్షు రూపానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాల్లో వైరల్ చేసారు.
అయితే గడిచిన కొంత కాలంగా మోక్షజ్ఞ హీరో అయ్యేందుకు ప్రిపరేషన్ లో ఉన్నాడనేందుకు అతడి మారిన గెటప్ అప్పియరెన్స్ సింబాలిక్. అయితే మోక్షజ్ఞ ఎప్పటికి హీరో అవుతాడు? అనేదానికి సరైన సమాధానం లేదు. తాజాగా భగవంత్ కేసరి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మోక్షజ్ఞ కోసం తన వద్దనే చాలా స్క్రిప్టులు ఉన్నాయని, అయితే ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేదే చెప్పలేనని అన్నారు. ఒక రోజులోనే కథ రెడీ అయిపోతుంది. కానీ దర్శకుడినే ఫైనల్ చేయాలి అని కూడా బాలయ్య బాబు అన్నారు. తనవద్ద చాలా కథలు, కంటెంట్ రెడీగా ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని భావించిన వారి సందేహాలు క్లియర్ చేస్తూ 2024లోనే మోక్షు డెబ్యూ ఉంటుందని ఇప్పటికి బాలయ్య క్లారిటీనిచ్చేశారు.
మోక్షజ్ఞపై ఎన్టీఆర్ మనవడు, బాలయ్య కొడుకు అనే ఒత్తిడి లేకుండా సింపుల్ గా పరిచయం చేసేస్తాననే ధీమాను బాలయ్య కనబరిచారు. మోక్షజ్ఞ భవిష్యత్ గురించి తనకు ఏ చీకూ చింతా లేదని కూడా తెలిపారు.
అంతేకాదు.. బాలకృష్ణ మాటలను బట్టి `ఆదిత్య 999 మ్యాక్స్` స్క్రిప్టుతో పాటు ఇంకా వేరే స్క్రిప్టులు కూడా మోక్షజ్ఞ కోసం రెడీగా ఉన్నాయి. అయితే ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్నదే సస్పెన్స్. ఇంతకుముందు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి తాను కూడా దర్శకత్వం వహించే వీలుందని బాలయ్య బాబు ఛూచాయగా చెప్పారు. చివరికి ఎవరూ దర్శకత్వానికి సూట్ కాకపోతే బాలయ్యే స్వయంగా దర్శకత్వం వహిస్తారా? అన్నది చూడాలి.