'ద‌స‌రా' తో పోస్ట‌ర్ల వేట‌..ఇక కోత‌లే!

దాదాపు అప్ క‌మింగ్ రిలీజ్ ల‌న్ని నేడు కొత్త పోస్ట‌ర్ల‌తో హీట్ పెంచుతున్నారు. మ‌రి ఏ హీరో ఎలాంటి ఆయుధం ప‌ట్టాడో ఓ లుక్ వేస్తే స‌రి.

Update: 2023-10-24 05:10 GMT

'ద‌స‌రా' ధ‌మాకాలు ఒక్కొక్క‌టిగా పేలుతున్నాయి. ఆయుధ పూజ‌తో వేట మొద‌లైంది. స్టార్ హీరోల చిత్రాల నుంచి చిన్న చిత్రాల వ‌ర‌కూ ఆయుధం ప‌ట్టిన హీరోని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ కొత్త పోస్ట‌ర్లు రిలీజ్ చేస్తున్నారు. దాదాపు అప్ క‌మింగ్ రిలీజ్ ల‌న్ని నేడు కొత్త పోస్ట‌ర్ల‌తో హీట్ పెంచుతున్నారు. మ‌రి ఏ హీరో ఎలాంటి ఆయుధం ప‌ట్టాడో ఓ లుక్ వేస్తే స‌రి.


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న 'స‌లార్' రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో ద‌స‌రా సంద‌ర్భంగా భారీగా క‌త్తులు..క‌టార్లు ఉన్న ఓ పోస్ట‌ర్ నే ప్ర‌త్యేకంగా రిలీజ్ చేసారు. అందులో ఎక్క‌డా డార్లింగ్ ని చూపించ‌కుండా కేవ‌లం స్టైలిష్ క‌త్తుల్నే హైలైట్ చేసారు. పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'దేవ‌ర' పోస్ట‌ర్ అంతే క్యూరియాసిటీని రెట్టింపు చేస్తుంది. టైగ‌ర్ చేతి పిడికిలో రింగులు తిరిగిన చుర క‌త్తి చాలా స్టైలిష్ గా ఉంది.


ఈ క‌త్తి 'డి 'అనే కోడ్ ని డీకోడ్ చేస్తుంది. అంటే 'దేవ‌ర' టైటిల్ ని హైలైట్ చేయ‌డం. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఏకంగా రెండు పోస్ట‌ర్లు రియ్యాయి. 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' లో భారీ స‌మ్మెట ప‌ట్టుకుని పీకే సీరియ‌స్ లుక్ లో ఉన్న పోస్ట‌ర్ ప్యాన్స్ లో పూన‌కాలు తెప్పిస్తుంది. అలాగే 'ఓజీ' నుంచి ప‌వ‌న్ క‌ళ్ల‌లో రౌద్రాన్ని ఓ రేంజ్ లో హైలైట్ చేసారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ 'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతున్నట్లు ద‌స‌రా సంద‌ర్భంగా ప్రకటించారు. చితకొట్టిన గుండాల్ని కారు ట్రంక్‌లో కూర్చుని బీడీ వెలిగిస్తున్న పోస్టర్‌ను మహేష్ బాబు స్వయంగా పోస్ట్ చేశారు.


అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' అప్ డేట్ ఇచ్చారు. మొదటి సింగిల్ టైటిల్‌ను వెల్లడిస్తూ చరణ్ కూడా దసరా పార్టీలో నిలిచారు. పోస్ట‌ర్ ఇంట్రెస్టిం గా ఉంది. చ‌ర‌ణ్ కాస్ట్యూమ్స్ ..అక్క‌డ లొకేష‌న్ డిజైన్ అన్ని బాగున్నాయి. 'జరగండి' అనే పాట‌లో చ‌ర‌ణ్ ఈ లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఇదే రేసులో మెగాస్టార్ చిరంజీవి కూడా నిలిచారు. ఆయ‌న156 వ చిత్రానికి సంబంధించి త్రిశూలంతో కూడిన పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. దైవాంశాలతో కూడిన పోస్టర్‌ను ఆక‌ట్టుకుంటుంది.


పోస్టర్‌లో 'మెగా మాస్ బియాండ్ యూనివర్స్' అని రాసి ఉంది. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని కొత్త సినిమా 'సరిపోదా శ‌నవారం' అంటూ చైన్ బ్రేకింగ్ పోస్ట‌ర్ తో వ‌చ్చేసాడు. నాని లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. భారీ యాక్ష‌న్ చిత్రంలా పోస్ట‌ర్ సినిమాని హైలైట్ చేస్తుంది. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు తన కొత్త సినిమా 'హరోమ్ హర'ని పోస్టర్‌తో ప్రకటించాడు. పోస్ట‌ర్ లో భారీ ఈటెప‌ని ఒడిలో పెట్టుకుని యుద్దాన్ని పూర్తిచేసిన వీరుడిలా హైలైట్ చేసారు.


ఇక యూత్ స్టార్ నితిన్' ఎక్స్‌ట్రా' - 'ఆర్డినరీ మ్యాన్' మూడు విభిన్నషేడ్స్‌లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు. అక్టోబర్ 30న టీజర్ రాబోతున్న‌ట్లు ఇందులో రివీల్ చేసారు. అలాగే బొమ్మాళి శంకర్‌గా ఫేమ‌స్ అయిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పి రవిశంకర్ తన కొత్త వెంచర్‌ను ప్రకటించారు. ఆయన తనయుడు అద్వాయ్‌ని హీరోగా పరిచయం చేయనున్న ఈ చిత్రానికి 'సుబ్రహ్మణ్య' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వీటితో పాటు ఇంకా చాలా సినిమాల పోస్ట‌ర్లు రిలీజ్ అయ్యాయి.







Tags:    

Similar News