బాక్సాఫీస్ - రూ.500 కోట్లు కొట్టేసిన వీరులు వీరే

సౌత్ ఇండియాలో 500+ కోట్ల కలెక్షన్స్ అందుకున్న స్టార్ హీరోల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తాడు

Update: 2024-07-02 04:17 GMT

సౌత్ ఇండియాలో 500+ కోట్ల కలెక్షన్స్ అందుకున్న స్టార్ హీరోల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తాడు. తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్, మూడో స్థానంలో, రాకింగ్ స్టార్ యష్, ఇళయదళపతి విజయ్ ఉన్నారు. ఇప్పటి వరకు సోలోగా 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకున్న సినిమాలు వీరి నుంచి మాత్రమే. వచ్చాయి. ఆర్ఆర్ఆర్ మూవీ 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన అది రామ్ చరణ్, తారక్ మల్టీ స్టారర్ కావడం విశేషం. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు సోలోగా 500 కోట్ల క్లబ్ లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అత్యధికంగా డార్లింగ్ ప్రభాస్ నాలుగు సార్లు 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ తన సినిమాలతో అందుకున్నాడు. అవి బాహుబలి 1 మూవీ వరల్డ్ వైడ్ గా 612 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తరువాత వచ్చిన బాహుబలి 2 మూవీ 1814 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది. వాటి తర్వాత సలార్ మూవీతో ప్రభాస్ 623.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఇప్పుడు కల్కి 2898ఏడీ సినిమాతో కేవలం 4 రోజుల్లోనే 555 కోట్ల కలెక్షన్స్ ని ప్రభాస్ అందుకున్నాడు. అతని ఖాతాలో కల్కి 1000 కోట్ల క్లబ్ మూవీగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

Read more!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫస్ట్ టైం 2.ఓ మూవీతో 500 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 675 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే మూవీ బడ్జెట్ ఎక్కువ కావడం వలన బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది. తరువాత గత ఏడాది జైలర్ మూవీతో చాలా కాలం తర్వాత కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ రజినీకాంత్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా. 605 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.

ఇళయ దళపతి విజయ్ లియో మూవీ అతని కెరియర్ లో ఫస్ట్ 500 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 618 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఇది టాప్ 2లో ఉంది. ఇక కన్నడ స్టార్ యాక్టర్ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2తో 500 కోట్ల క్లబ్ హీరోగా మారాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1210 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సౌత్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాల జాబితాలో టాప్ 3లో ఈ మూవీ నిలిచింది.

నెక్స్ట్ 500 కోట్ల క్లబ్ లో చేరే సత్తా టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప ది రూల్ తో సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే దేవర చిత్రంతో ఎన్టీఆర్ కూడా 500 కోట్ల క్లబ్ హీరోగా చేరుతాడని అంచనా వేస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఆ స్టామినా ఉంది. అయితే గేమ్ చేంజర్ తో ఈ ఫీట్ అందుకుంటాడా లేదంటే RC16తో సాధ్యం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేయబోతున్న సినిమాతో 500 క్లబ్ లో చేరుతాడని కచ్చితంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News

eac