డిసెంబర్ లో ఇన్ని సినిమాలా..
అలాగే మంచి బజ్ ఉన్న మూవీస్ అన్ని కూడా డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకి రాబోతూ ఉండటం విశేషం.
ఈ ఏడాది డిసెంబర్ లో టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే మంచి బజ్ ఉన్న మూవీస్ అన్ని కూడా డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకి రాబోతూ ఉండటం విశేషం. వాటిని ఓ సారి చూసుకుంటే డిసెంబర్ 1న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ రిలీజ్ అవుతోంది.
దీంతో పాటుగా సుదీర్ కాలింగ్ సహస్ర, ఉపేంద్రగాడి అడ్డా, అథర్వ సినిమాలు కూడా థియేటర్స్ లోకి వస్తున్నాయి. వీటి తర్వాత డిసెంబర్ 7న నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న రిలీజ్ కాబోతోంది. నితిన్ ఎక్స్ట్రార్డినరీ మెన్ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకి రానుంచి. డిసెంబర్ 15న జోరుగా హుషారుగా అనే చిన్న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది.
శ్రీరామ్ శ్రీకాంత్ హీరోగా నటిస్తోన్న పిండం మూవీ డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఇక డిసెంబర్ 22న షారుఖ్ ఖాన్ డుంకీ, డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా బ్రాండ్ తో రానున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇద్దరు కూడా స్టార్ హీరోలు కావడం. ఇద్దరికీ దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉండటం టఫ్ ఫైట్ ఉండబోతోంది.
డిసెంబర్ లో గట్టిగా సౌండ్ చేసే సినిమాలు అంటే యానిమల్, హాయ్ నాన్న, ఎక్స్ట్రార్డినరీ, డుంకీ, సలార్ సినిమాలు అని చెప్పాలి. ఈ సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటాయి అని చిత్ర యూనిట్లు అంచనా వేస్తున్నారు. అన్నిటికంటే డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో వస్తోన్న సలార్ సినిమాపైన మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
సలార్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది వెయ్యి కోట్ల సినిమా రాబోతోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి. అలాగే అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న యానిమల్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ అయిన తెలుగులో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.