రిలీజ్ ల పై రెయిన్ పంచ్.. దేవుడా కరుణించవా!
కానీ బయట వాతావరణం సినిమా లకు ఏమాత్రం సహకరిస్తున్నట్లు కనిపించలేదు.
ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో 'బేబి' అతి పెద్ద విజయంగా చెప్పొచ్చు. ఈ సినిమా కమర్శియల్ గా బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లని సాధిస్తోంది. మొన్నటివరకూ '2018'..'ది కేరళ స్టోరీ' లాంటి చిత్రాల గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేవారు. తాజాగా 'బేబి' సక్సెస్ తో జనాలు డైవర్ట్ అయ్యారు. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాకి యువత ఆసక్తి చూపించడంతో రిలీజ్ నుంచి నేటి వరకూ 'బేబి' దే హవా. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నా బేబి థియేటర్లు మాత్రం బాగానే ఫుల్ అవుతున్నాయి.
వర్షం ప్రభావం అయితే థియేటర్ల వద్ద కనిపిస్తోంది. తాజాగా 'హత్య'.. 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'.. 'హార్ చాప్టర్ వన్'..'డిటెక్టివ్ కార్తిక్'.. 'నాతో నేను''.'' ఒక్కడే వీరుడు'..కాజల్ నటించిన 'కార్తీక' లాంటి సినిమాలు నేడు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటితో పాటు హాలీవుడ్ సినిమా 'ఓపెన్ హెయిమర్' రిలీజ్ అయింది. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్ల ఇబ్బంది కాస్త కనిపిస్తోంది.
సర్దుబాటు అవ్వడంలో అటు ఇటు అవుతుంది. అయితే ఇప్పుడీ సినిమాలపై వర్షం ప్రభావం తీవ్రంగా పడుతున్నట్లే కనిపిస్తోంది. హైదరాబాద్ లాంటి సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటం లేదు. మిగతా చోట్లా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాల ఓపెనింగ్ వసూళ్ల పై ప్రభావం కనిపిస్తోంది. వర్షాల్ని సైతం లెక్క చేయకుండా థియేటర్ కి వచ్చి ప్రేక్షకులు సినిమా చూడాలంటే నిరూపించుకోవాలి.
తొలి షోతోనే పాజిటివ టాక్ దక్కించుకుంటే...జనాలు థియేటర్ వైపు వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. కేవలం కంటెంట్ ని నమ్ముకుని రిలీజ్ అయిన చిత్రాలు. కానీ బయట వాతావరణం సినిమా లకు ఏమాత్రం సహకరిస్తున్నట్లు కనిపించలేదు. మరో నాలుగైరదు రోజులు ఇలాగే ఉంటుందా? అన్న సందేహం మొదలైంది.
ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి అని దర్శక- నిర్మాతలు..పంపిణీదారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చిన వారం వ్యవదే ఉంటుంది. వచ్చే వారంలో 'బ్రో' లాంటి పెద్ద సినిమి రిలీజ్ అవుతుంది. ఇంకా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. అప్పుడు థియేటర్లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. హిట్ టాక్ తెచ్చుకుంటే లాంగ్ రన్ ఉంటుంది.