ఆయన ఎవరికో క్లాస్ పీకినట్లే ఉందే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనో కామ్ గోయింగ్ హీరో. వివాదాలు..విమర్శలు అనేవి ఆయన డిక్షనరీలో ఎక్కడా కనిపించవు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనో కామ్ గోయింగ్ హీరో. వివాదాలు..విమర్శలు అనేవి ఆయన డిక్షనరీలో ఎక్కడా కనిపించవు. సినిమాలు తప్ప మరో ఆలోచన లేని హీరో అతను. హీరో..నిర్మాతగా..బిజినెస్ మ్యాన్ గా ఇలా మూడు రంగాల్లో తనదైన ముద్ర వేసి దూసుకుపోతున్నారు. ఇక ఎలాంటి వేదికైనా మాట్లాడేది కూడా చాలా తక్కువే. ఒక వేదికని మరో వేదిక గా చేసుకుని మాట్లాడటం అన్నది ఆయనకి అస్సలు తెలియదు.
ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు తప్ప ఇంకే కనిపించదు. లోపల ఎన్నిరకాల టెన్షన్లు ఉన్నా చిరు నవ్వు మాత్రం చెరగదు. అలాంటి హీరో తొలిసారి అత్యంత వేగంగా సినిమా పూర్తి చేసాం అనే వ్యాఖ్య ఎవరికో కౌంటర్ గా పడిందనే కొత్త చర్చ ఫిలిం సర్కిల్స్ లో మొదలైంది. ఆ మాట ఆయన నోట సాధారణంగా అలా వచ్చేసిందా? లేక ఇంకేదైనా ఉద్దేశంతో అన్నారా? తెలియదు గానీ ఎప్పుడూ మాట్లాడని హీరో తొలిసారి మేకింగ్ గురించి...అది పూర్తవ్వడం గురించి మాట్లాడే సరికి రకరకాల సందేహాలు చర్చకొస్తున్నాయి.
మరి ఇది సందేహమా? సహజంగా జరిగిపోయిందా? అన్నది క్లారిటీ రావాలి. సదరు హీరో చాలా కాలంగా సొంత నిర్మాణ సంస్థలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. కొత్త వారిని పరిచయం చేయడంలోనూ ఆయన ఎప్పడూ ముందుంటారు. అలా ఇప్పటివరకూ ఎంతో మంది దర్శకుల్ని పరిచయం చేసారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు విజయం సాధించాయి. కొన్ని పరాజయం చెందాయి.
సినిమా తీసాక హిట్..ప్లాప్ ఎదో ఒకటి తప్పదు. అది అందరూ అంగీకరించాల్సిందే. అయితే ఆ ప్రాసస్ లో ఎక్కడైనా తేడా జరిగితేనే విమర్శ..వివాదాలకు దారి తీసినట్లు ఉంటుంది. మరి అలాంటి సన్నివేశానికైనా ఎప్పుడైనా గురయ్యారా? ఆ కారణంగానే ఏ దర్శకుడికైనా కౌంటర్ గా ఉండాలనే అలా వ్యాఖ్యానించారా? అన్నది ఫిలిం సర్కిల్స్ లో చర్చగా మారింది.