వంగా క్లాప్ తో మొదలైన మోగ్లీ
ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ రెండో సినిమా 'మోగ్లీ 2025' పూజా కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా మొదటి క్లాప్ కొట్టడం విశేషం.
సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా దర్శకుడిగా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కష్టపడే కొత్త తరానికి ఆయన నిత్యం సపోర్ట్ గానే ఉంటారు. తన సహకార ధోరణితో యువ దర్శకులకు అండగా నిలుస్తున్నారు. తన మార్క్ సినిమాలతో గుర్తింపు పొందిన వంగా తాజాగా మరో ఆసక్తికర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ రెండో సినిమా 'మోగ్లీ 2025' పూజా కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా మొదటి క్లాప్ కొట్టడం విశేషం.
ఈ చిత్రంలో యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల, క్యూట్ హీరోయిన్ సాక్షి సాగర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. 'కలర్ ఫోటో' సినిమాతో క్రిటికల్ అప్రూవల్ పొందిన సందీప్ రాజ్ రెండవ సినిమాను స్టార్ట్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు 'మోగ్లీ 2025'తో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ కథపై ఆసక్తిని రేకెత్తించింది.
రోషన్ కనకాల తన కొత్త లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. గత చిత్రాల్లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న రోషన్, ఈ సినిమాతో మరో బిగ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకలో 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కెమెరాను స్విచ్ ఆన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తన దృఢ సంకల్పంతో వివిధ ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్న ఆయన, ఈ సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కాగా, ఈ చిత్రానికి కీరవాణి తనయుడు ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' లాంటి బిగ్ స్కేల్ చిత్రాల్లో పనిచేసిన రామమారుతి ఎం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర బృందం అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో కూడుకుని ఉన్నందున సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.
'మోగ్లీ 2025' గూర్చి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం, ఇది ఒక నూతనమైన కథాంశంతో, యూత్‌ను ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని అర్థమవుతోంది. రోషన్, సాక్షి జంటగా రాబోతున్న ఈ చిత్రం, భారీ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌తో సందీప్ రాజ్ మరోసారి తన దర్శక ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందనున్నారు. మోగ్లీ 2025 టీజర్, ట్రైలర్ విడుదల కంటే ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకుంటోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.