మిస్టర్ బచ్చన్ సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే
ఈ చిత్రంలో మిక్కీ జె మేయర్ అంధించిన సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న "మిస్టర్ బచ్చన్" చిత్రం విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రంలో అన్ని అంశాలను మిళితం చేసి, ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాన్ని సృష్టించాడు. రవితేజ, భవ్యశ్రీ బోర్సే మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీను సత్య మరియు అతని గ్యాంగ్ కమెడీ ట్రాక్‌తో అనుసంధానం చేయడం ఈ చిత్రాన్ని మరింత రసవత్తరంగా మార్చనుందట.
ఈ చిత్రంలో మిక్కీ జె మేయర్ అంధించిన సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, ఆనందాన్ని పంచేలా ఉంటుందట. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ బోర్డు నుండి యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. మొత్తం 2 గంటలు 38 నిమిషాల నిడివితో, ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది.
సినిమా సెకండ్ హాఫ్ లో రొమాన్స్, వినోదం నుంచి యాక్షన్ వైపుకు మారుతుంది. రవితేజ ఆదాయపు పన్ను అధికారిగా, జగపతిబాబు పోషించిన అధికారి పాత్ర మధ్య యుద్ధం ప్రధానంగా ఉంటుంది. ఈ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా, ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగుతాయని తెలుస్తోంది. రవితేజ, జగపతిబాబు ఇద్దరూ తమ పాత్రలలో ఒదిగి, వీరి మధ్య సన్నివేశాలు సినిమాకు మరింత ప్రాధాన్యతను అందించాయని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.
ఇక హరీష్ శంకర్ తన కమెర్షియల్ సినిమాల ఎత్తుగడలో ఈ చిత్రంలోను ప్రేక్షకులను బంధించి ఉంచడంలో నైపుణ్యం చూపించాడని తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, రవితేజ, భవ్యశ్రీ బోర్సే మధ్య సీన్లు, డాన్స్ నంబర్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం అత్యంత విలువైన నిర్మాణ విలువలతో సరికొత్త అనుభూతి ఇవ్వనున్నట్లు ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇక సెన్సార్ బోర్డు హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ, సినిమా ఆదాయపు పన్ను సన్నివేశాలను నైపుణ్యంతో రూపొందించడం, ప్రతి వర్గ ప్రేక్షకులను అలరించేలా ఉండటాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో "మిస్టర్ బచ్చన్" యూనిట్ ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.