ఆ ఛాలెంజ్ హీరోయిన్ జీవితాన్ని మార్చిందా..?

కెరీర్ లో లిమిటేషన్స్ ఉన్న పాత్రలు చేయడానికి సుముఖంగా లేనని అంటుంది మృణాల్.

Update: 2024-07-01 03:39 GMT

మనం ఎంచుకునే పాత్రలే మన కెరీర్ ని నిర్ణయిస్తాయి. అంతేకాదు నీలో ప్రతిభ ఉంటే మొదలు పెట్టింది ఎక్కడైనా నిన్ను చేరాల్సిన చోటికి.. దక్కాల్సిన క్రేజ్ దక్కేలా చేసింది. ఈ లైన్ కు పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ గా ఉంటుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో సీరియల్స్ లో నటిస్తూ అక్కడ టాలెంట్ చూపి సినిమాల్లో ఛాన్సులు అందుకుంది మృణాల్. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో సినిమాల్లో నటించినా సరే పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడింది. ఐతే తనకు తానుగా అసలు నటిని అవుదామని అనుకోలేదని అంటుంది మృణాల్ ఠాకూర్.

రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమా ఎంట్రీ ఇంకా కెరీర్ గురించి మాట్లాడిన మృణాల్ కాలేజ్ టైం లో ఒక వ్యక్తి తనని తక్కువ చేసి మాట్లాడటం వల్లే సీరియల్ ఆడిషన్ కి వెళ్లానని. అలా 18 ఏళ్ల వయసులోనే సీరియల్స్ మొదలు పెట్టానని అంటుంది మృణాల్. ఇక ఎంచుకునే కథలు ఎలా ఉన్నా నటిగా సంతృప్తి చెందడమే తన లక్ష్యమని అంటుంది మృణాల్. మన పని మనం చేసుకుంటూ పోతే మనకు రావాల్సి వస్తుందని అంటుంది.

కెరీర్ లో లిమిటేషన్స్ ఉన్న పాత్రలు చేయడానికి సుముఖంగా లేనని అంటుంది మృణాల్. మొదట్లోనే కథా బలం ఉన్న సినిమాలు చేశానని ఇక మీదట కూడా అలానే చేస్తానని అంటుంది అమ్మడు. ఇక తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోనని అంటుంది మృణాల్. కల్కి సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేసిన మృణాల్ అలా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఐతే కల్కి లో నటించాలని అడిగితే అసలేమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని అన్నది మృణాల్.

కల్కి కథ ఏంటి ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా తెలియదు వైజయంతి సినిమా అనగానే మరో మాట మాట్లాడకుండా చేశానని అంటుంది మృణాల్. రిలీజ్ అయ్యాక ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూసి సంతోషంగా ఉందని అంటుంది. కల్కి సినిమాలో ఒక భాగమైనందుకు సూపర్ హ్యాపీ అనేస్తుంది మృణాల్. ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్ సినిమా చేస్తున్న మృణాల్ నెక్స్ట్ తెలుగు సినిమా చర్చల దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది. తనకు ఇచ్చిన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న మృణాల్ నుంచి ఇంకా ఎన్నో మంచి సినిమాలు ఆశిస్తున్నారు ఆడియన్స్.

Tags:    

Similar News