మృణాల్ డిమాండ్ బాగానే ఉంది..?

ఆమె బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా విచిత్రంగా జరిగింది.

Update: 2024-07-27 12:30 GMT

బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో తిష్ట వేసుకుని కూర్చున్న భామలు చాలా తక్కువ మంది ఉన్నారు. ముంబై భామలు వచ్చి ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కానీ హిందీలో సినిమాలు చేస్తూ అక్కడ సోసోగానే ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ టాలీవుడ్ వచ్చి స్టార్ రేంజ్ కి వెళ్లడం మాత్రం అది మృణాల్ ఠాకూర్ విషయంలోనే జరిగింది. ఆమె బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా విచిత్రంగా జరిగింది.

అక్కడ ముందు సీరియల్స్ లో నటించిన మృణాల్ అక్కడ సత్తా చాటి చిన్నగా సినిమాల్లో స్థానం సంపాదించింది. ఇక హను రాఘవపుడి డైరెక్షన్లో తెరకెక్కిన సీతారామం సినిమాతో మృణాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో అమ్మడికి ఇక్కడ సూపర్ పాపులారిటీ వచ్చింది. సీతారామం తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న కూడా అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చింది. నటించిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో మృణాల్ కి తెలుగులో డిమాండ్ పెరిగింది.

ఇక చివరగా విజయ్ దేవరకొండతో అమ్మడు చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశ పరిచినా ఆ సినిమాలో కూడా మృణాల్ తన వరకు బెస్ట్ ఇచ్చింది. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ కల్కి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది మృణాల్. తనకు టాలీవుడ్ ఆఫర్ ఇచ్చిన వైజయంతి మూవీస్ వారు అడగ్గానే అసలు తన పాత్ర ఏంటి అన్నది కూడా ఆలోచించకుండా కల్కిలో నటించానని చెప్పింది మృణాల్.

ఐతే ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవ్వడంతో అమ్మడి దూకుడు తగ్గింది. ప్రస్తుతం అమ్మడు రెండు మూడు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం మృణాల్ రెమ్యునరేషన్ పరంగా కూడా భారీగానే డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. బాలీవుడ్ తో పోల్చితే మృణాల్ కి తెలుగులోనే మంచి ఎంకరేజ్మెంట్ ఉందని భావిస్తుంది. అందుకే తెలుగులో ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే కాదనకుండా చేయాలని చూస్తుంది. ఐతే మృణాల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆమె ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హను కాంబోలో వచ్చే ఫౌజి సినిమాలో కూడా మృణాల్ ని హీరోయిన్ గా తీసుకుంటారన్న టాక్ నడుస్తుంది. అదే నిజమైతే అమ్మడు పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News