సీతమ్మ కి వారిద్దరే స్పూర్తి!
అంటే మృణాల్ ఇద్దరు పేర్లు ప్రముఖం గా చెబుతుంది. వారే రష్మిక మందన్న...దుల్కర్ సల్మాన్. ఈ ముగ్గురి కాంబినేషన్ లోనే 'సీతారామం' తెరకెక్కిన సంగతి తెలిసిందే.
మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగింట ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడి అభిమానుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని రెండు సినిమాలతోనే దక్కించుకుంది. 'సీతారామం'లో సీత పాత్ర..'హాయ్ నాన్న'లో యష్న పాత్రలు ఎంత గొప్పగా పండాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండు పాత్రలు ఆమెని ప్రత్యేకమైన నటిగా తీర్చిదిద్దాయి. ఇలాంటి పాత్రల్లో తాను మాత్ర నటించగలని ప్రూవ్ చేసింది.
తనలో ఆ క్వాలిటీనే మృణాల్ ని మిగతా భామల నుంచి వేరు చేస్తుంది. ఎలాంటి అశ్లీలతకు తావు ఇవ్వ కుండా చేసిన ఆ పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. అందుకే అంత మంచి పేరు దక్కించుకుంది. మరి ఇలాంటి పాత్రల ఎంపికకు స్పూర్తి ఎవరు? అంటే మృణాల్ ఇద్దరు పేర్లు ప్రముఖం గా చెబుతుంది. వారే రష్మిక మందన్న...దుల్కర్ సల్మాన్. ఈ ముగ్గురి కాంబినేషన్ లోనే 'సీతారామం' తెరకెక్కిన సంగతి తెలిసిందే.
అందులో ఆప్రీన్ పాత్రలో రష్మిక మందన్న..ఆర్మీ ఆఫీసర్ పాత్రలో దుల్కర్ నటించాడు. అయితే ఆప్రిన్ పాత్రకు రష్మిక తప్ప ఇంకేనటి న్యాయం చేయలేని మృణాల్ చెబుతుంది. రష్మిక అన్ని వేళలా అలసట లేకుండా పనిచేస్తుందని..తనంత యాక్టివ్ గా తాను ఉండలనేని ఈ విషయాలో రష్మిక తనకెంతో స్పూర్తి అంది. ఇక దుల్కర్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు. అది ఆయన అంకిత భావానికి నిదర్శనం అంది.
'నా జీవితంలో వీరిద్దర్నీ స్పూర్తిగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను అని బలంగా చెప్పగలను. అలాంటి వారి నుంచి స్పూర్తి పొందితే మంచి కథలు..పాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలియ కుండానే వాళ్ల ప్రభావం నాపై బలంగా ఉందనపిస్తుంది' అంది. ఆ రకంగా అమ్మడు తన సక్సెస్ సీక్రెట్ కూడా వారిద్దరే అన్నట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లు అయింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్..విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' లో నటిస్తోంది.