ట‌బ్ లో మృణాల్..కిక్కిచ్చే భంగిమ‌లో!

తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి చ‌ర్చ‌కొచ్చింది. ఇదిగో ఇక్క‌డిలా బాత్ ట‌బ్ భంగిమ‌లో హీటెక్కిస్తుంది.

Update: 2024-08-18 04:19 GMT

మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆరంభంలో ఎంత‌గా శ్ర‌మించిందో ఇప్పుడంత కూల్ గా సాగిపోతుంది. ప‌ట్టిందాల్లా బంగార‌మే అవుతుంది. 'క‌ల్కి 2898'లో చిన్న పాత్రైనా పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కించుకుంది. తెలుగు ప‌రిశ్ర‌మ అమ్మ‌డికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్న‌ది ఆ సినిమాతో దేశ‌మంతా తెలిసింది. ఆ స‌క్సెస్ కంటే ముందే బాలీవుడ్ లోనూ బిజీ అయింది.

 

ఇప్పుడు అమ్మ‌డి ఫోక‌స్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. కొత్త‌గా అక్క‌డ నుంచి నేర్చుకోవాల్సిందేం లేదు. అక్క‌డ క‌ల్చ‌ర్ కి త‌గ్గ‌ట్టు దూసుకుపోతుంది. గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ ఎలా ఉండాలో? అక్క‌డ నుంచే నేర్చుకుంది. అందుకు త‌గ్గ‌ట్టే అమ్మ‌డి ఇన్ స్టా యాక్టివిటీ క‌నిపిస్తుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి చ‌ర్చ‌కొచ్చింది. ఇదిగో ఇక్క‌డిలా బాత్ ట‌బ్ భంగిమ‌లో హీటెక్కిస్తుంది.

 

ప్లోర‌ల్ దుస్తుల్లో అమ్మ‌డు స్నాన‌మ‌డుతోన్న వైనం చూడొచ్చు. రెడ్ క‌ల‌ర్ లైటింగ్ లో అమ్మ‌డి స్కిన్ టోన్ మ‌రింత షైనింగ్ అవుతుంది. చెవుల‌కు ధ‌రించిన డిజైన‌ర్ చెవులీలు సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతు న్నాయి. మ‌రో రెండు పిక్స్ లో స్టాండిగ్ భంగిమ‌ల్లో మ‌రికొన్ని ఫోజులిచ్చింది. టోట‌ల్ గా సీత‌మ్మ‌లో వేడి మ‌రోసారి కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.

 

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. నెటి జ‌నులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బాత్ ట‌బ్ బ్యూటీ అంటూ ఓ నెటి జ‌నుడు పోస్ట్ పెట్టాడు. ఇక బాలీవుడ్ లో అమ్మ‌డు మూడు సినిమాలు లైన‌ప్ లో పెట్టింది. 'స‌న్నాప్ స‌ర్దార్ -2',' పూజా మేరీ జాన్,' 'హేజ‌వానీ తో ఇష్క్' చిత్రాల్లో న‌టిస్తోంది.

Tags:    

Similar News