ఆ హీరోతో సీతమ్మ రొమాన్స్..పిలిచి మరీ!
మృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే
మృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ని మించి బాలీవుడ్ లో రెట్టించిన పారితోషికంతో అవకాశాలు ఒడిసి పట్టుకుంటుంది. ఇప్పటికే `పూజా మేరీజాన్` షూటింగ్ పూర్తి చేసింది. అలాగే `హైజవానీ హై తో ఇష్క్ హోనా హై` అనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.
త్వరలో ఈ సినిమా షూట్ కూడా పూర్తవుతుంది. అయితే ఇది సెట్స్ లో ఉండగానే అమ్మడు మరో క్రేజ్ ఛాన్స్ అందుకుంది. ఈసారి ఏకంగా హిట్ సినిమా సీక్వెల్ లోనే ఛాన్స్ అందుకుంది. దర్శక, హీరోలు ఏరికోరి మరీ సీతమ్మని ఎంపిక చేసారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షీ ప్రధాన పాత్రల్లో అశ్వినీ ధిర్ తెరకెక్కించిన `సన్నాఫ్ సర్దార్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
యాక్షన్ డ్రామా పదేళ్ల క్రితమే వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. 170 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. `సన్నాఫ్ సర్దార్ -2` టైటిల్ తో దీన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసారు. ఈ విషయాన్ని అమ్మడు స్వయంగా రివీల్ చేసింది. తొలి భాగంలో నటించిన సోనాక్షి సిన్హా ని పక్కనబెట్టి మృణాల్క కి ఛాన్స్ ఇచ్చారు.
ఈ మధ్య కాలంలో నేచురల్ పెర్పార్మర్ గా అమ్మడు నార్త్ లోనూ బాగా ఫేమస్ అవుతోన్న సంగతి తెలిసిందే. అందుకే పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఈసినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ సీక్వెల్ దర్శకుడు మాత్రం అశ్విన్ కాదు. విజయ్ కుమార్ అరోరా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో విజయ్ కుమార్ `గుడ్ డే చా`, ` కాళీ జొట్టా`, `స్ట్రీట్ డాన్సర్-3` లాంటి సినిమాలు తెరకెక్కించాడు. ఆ అనుభవంతోనే అజయ్ దేవగణ్ ఛాన్స్ ఇచ్చాడు.