టాప్ సీక్రెట్ లీక్ చేసిన మృణాల్!
అందరి నాయికల్లా కాకుండా తనకంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ అయిందంటే? కారణం తనలో ఆయూనిక్ క్వాలిటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బలమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడం అంత ఈజీ కాదు. అలా సాధ్యమ వ్వాలంటే? పాత్రల పట్ల తనకంటూ ఓ అవగాహన ఉండాలి. ఎలాంటి పాత్రల్ని ప్రేక్షకుల్ని స్వాగతి స్తారో..వాళ్ల పల్స్ ని పట్టుకుని సినిమాలు చేయాలి. ఈ ప్రోసస్ లో చాలా సమయం పట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఓపిక సహనం కావాలి. కేవలం పారితోషికం కమిట్ మెంట్ ఇవ్వడం కాదు...ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా కమిట్ మెంట్ ఇవ్వాలి అన్నది మృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ నినాదం.
అందుకే 'సీతారామంతో' సీతమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థానాన్ని సంపాదించింది. అటుపై 'హాయ్ నాన్న'లో సైతం అంతే బలమైన పాత్ర పోషించి నటిగా సత్తా చాటింది. ఈ రెండు సినిమాలు మృణాల్ కి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాయో చెప్పాల్సిన పనిలేదు. పూర్తి స్థాయిలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించడంతోనే ఇది సాధ్యమైంది. అందరి నాయికల్లా కాకుండా తనకంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ అయిందంటే? కారణం తనలో ఆయూనిక్ క్వాలిటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? అంటూ అమ్మడు ఆ గుట్టు కూడా విప్పేసింది. నటిగా మ్యాకప్ వేసుకున్నప్పటి నుంచి నా లక్ష్యం ఒక్కటే. మృణాల్ గా ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకున్నా నా పాత్రలతో వాళ్ల మదిపై చెరగని ముద్ర వేయాలి అనుకున్నా. నా కథలు..పాత్రల ఎంపికలో స్పూర్తినిచ్చేది అదే. ఓసారి సీతగా పేరు తెచ్చుకుంటే తదుపరి సినిమాలో ఆ పాత్రని మరిపించే పాత్రలో నటించాలని బలంగా అనుకుంటా. అలాంటి కథని పాత్రని వెతికి పట్టుకోవడం కోసం ఎంతో సహనంతోనూ ఎదురుచూస్తుంటా.
తొందర పడి ఏది పడితే అది చేసి తప్పుచేయాలని అస్సలు అనుకోను. ఎన్ని చిత్రాలు చేసాను అని నెంబర్ కంటే? ఎన్ని గొప్ప పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాను అన్నదే నాకు ముఖ్యం అని అంది.
ప్రస్తుతం మృణాల్ హీరోయిన్ గా విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తోంది. 'ఫ్యామిలీ స్టార్' టైటిల్ తో ఈ చిత్రాన్ని పరశురాం తెరకెక్కిస్తున్నాడు. ఈయన సినిమాల్లోనూ హీరోయిన్ పాత్రలు అంతే బలంగా ఉంటాయి అన్నది తెలిసిందే.