కాస్టింగ్ డైరెక్టర్‌తో కృతి రిలేషన్‌పై అపార్థం?
తాను ఒక అబద్ధం చెప్పి కృతి సనోన్ ని బాధ పెట్టానని, నిజంగా తనవల్ల ఆ తప్పు జరిగిందని ముఖేష్ చాబ్రా ఓపెనయ్యారు.
ఆదిపురుష్ బ్యూటీ కృతి సనోన్.. బాలీవుడ్ ప్రముఖుడితో డేటింగ్ లో ఉందంటూ ప్రచారం సాగింది. కానీ ఇది నిజం కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అతడు తనను సోదరి అని ఆప్యాయంగా పిలిచాడు. తనతో అత్యంత అందమైన సోదరబంధం ఉందని స్పష్ఠతనిచ్చాడు. అయితే అతడు అహంకారంతో కళ్లు మూసుకుపోవడం వల్ల సోదరి లాంటి కృతితో రిలేషన్ షిప్‌ని కోల్పోవాల్సి వచ్చిందని, తర్వాత దాని నుంచి కోలుకునేందుకు తిరిగి కలుపుకునేందుకు కొంత సమయం పట్టిందని కూడా వివరణ ఇచ్చాడు. మీడియా ప్రముఖుడు నీలేష్ మిశ్రాతో ఇంటర్వ్యూలో అతడు చాలా సంగతులే బయటపెట్టాడు.
తన తల్లి మరణం .. అనంతరం స్నేహితుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కోల్పోయిన బాధలో ఉండగా జీవితంలో ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన వ్యక్తిగత వైఫల్యాల గురించి మాట్లాడారు ముఖేష్ చాబ్రా. ఈ కష్టకాలంలోనే తాను ఒక మంచి సోదరితో అనుబంధాన్ని కోల్పోయానని బాధపడ్డాడు. ఆ సోదరి మరెవరో కాదు కృతి సనోన్ అని అన్నారు. తాను ఒక అబద్ధం చెప్పి కృతి సనోన్ ని బాధ పెట్టానని, నిజంగా తనవల్ల ఆ తప్పు జరిగిందని ముఖేష్ చాబ్రా ఓపెనయ్యారు. తాను కృతి సనన్‌ను బాధపెట్టడం గురించి బహిరంగంగా మాట్లాడాడు.. ''కృతి నాకు సోదరి లాంటిది.. నేను ఆమెను నా నిజమైన సోదరిగా భావించి ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను ఆమె గురించి అబద్ధం చెప్పే పరిస్థితి ఉంది. అయితే దాని గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. దాన్ని సరిచేయడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది'' అని చాబ్రా అన్నారు.
అదే ఇంటర్వ్యూలో తన జీవితంలోని ప్రేమ(ప్రేమ వైఫల్యం)ను కోల్పోయానని..అలాంటివారిని తగిన గౌరవంతో చూడలేదని చెప్పాడు.. అహంభావంతో అలా చేసానని అంగీకరించాడు. ఇది నా (సోదర) ప్రేమ, ఆరేడేళ్ల పాటు కొనసాగింది. కానీ నేను దానిని కోల్పోయాను. నా తల్లి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కోల్పోయిన బాధ ఒక వైపు ఉంది.. మరోవైపు సోదరిని దూరం చేసుకున్న బాధ కూడా ఉంది. నేను చాలా ప్రయత్నించాను.. కానీ దానిని కోల్పోయాను. నేను కష్టపడుతున్న రోజుల్లో నా వద్ద డబ్బు లేనప్పుడు ఆమె(కృతి సనోన్) నాతో ఉంది.. కానీ నేను తనను కోల్పోయాను.. దానికి నేను జీవితాంతం పశ్చాత్తాపం చెందుతూనే ఉన్నానని అన్నారు.
కాస్టింగ్ డైరెక్టర్ ఛాబ్రా తన అహంకారం కారణంగా బంధాలు విచ్ఛిన్నం అయ్యాయని అంగీకరించాడు. తన జీవితంలో ''ఆ ఆరు నెలల్ని గుర్తుంచుకోవాలనుకోవడం లేదు'' అని చెప్పాడు. తన తల్లి మరణం.. ప్రేమికురాలిని దూరం చేసుకోవడం.. సోదరితో అనుబంధం కోల్పోవడం.. ఇవన్నీ ఆ ఆరు నెలల్లోనే. అందుకే ఆ రోజుల్ని గుర్తు పెట్టుకోలేనని ఛాబ్రా ఆవేదన చెందారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన 'దిల్ బేచారా'తో ముఖేష్ ఛాబ్రా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇది సుశాంత్ సింగ్ కి చివరి చిత్రం.. అతడి మరణానంతరం విడుదలైంది. ఇటీవల 'అమర్ సింగ్ చమ్కిలా' కోసం నటీనటుల ఎంపికను ఛాబ్రా సారథ్యంలో చేసారు. ఈ చిత్రం మంచి సమీక్షలతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించారు.