కల్కీ.. మహాభారతాన్ని వక్రీకరించారు: స్టార్ యాక్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 మూవీ మంచి హిట్ అయిన విషయం తెలిసిందే

Update: 2024-07-05 04:33 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 మూవీ మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ మంచి వసూళ్లను రాబడుతోంది. నార్త్ యూఎస్ లో 13.5 మిలియన్ డాలర్స్ కుపైగా కలెక్ట్ చేసి దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్ గా వారం రోజుల్లో రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోనుంది!

అయితే కల్కి సినిమాపై ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. సినిమా కోసం కల్కి మేకర్స్ మహాభారతాన్ని వక్రీకరించారని ఆరోపించారు. కొన్ని సీన్స్ కోసం ఇతిహాసాన్ని మార్చేందుకు చూశారని అన్నారు. నాగ్ అశ్విన్ విజన్, మేకింగ్ ను ప్రశంసించిన ఆయన.. కొన్ని నిర్ణయాలను మాత్రం తప్పుపట్టారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కల్కి రివ్యూను వెల్లడించారు ముఖేష్ ఖన్నా.

మహాభారతంలో అశ్వత్థామ నుంచి శ్రీకృష్ణుడు మణి తీసుకోలేదని తెలిపారు ముఖేష్ ఖన్నా. సినిమా కథాంశాల కోసం హిందూ పురాణాలను వక్రీకరించవద్దని చిత్రనిర్మాతలను కోరారు. తాను చిన్నప్పటి నుంచి మహాభారతం చదువుతున్నానని చెప్పారు. అశ్వత్థామ మణిని తొలగించింది శ్రీ కృష్ణుడు కాదని తెలిపారు. ఈ విషయంలో మేకర్స్ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ముఖేష్ ఖన్నా తప్పుపట్టారు.

Read more!

“అర్జునుడు, అశ్వత్థామ మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. కానీ దాడిని ఎలా తిప్పికొట్టాలో అర్జునుడికి మాత్రమే తెలుసు. అశ్వత్థామ చేయలేనందున అభిమన్యుడి భార్యపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. గర్భవతి అవ్వడం వల్ల కృష్ణుడు ఆమెను తొమ్మిది నెలలు రక్షించాడు. నేను ఈ కథను ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉంది" అని అన్నారు.

"కల్కిలో కృష్ణుడు తనను రక్షించమని అశ్వత్థామను ఎలా ఆజ్ఞాపించాడో నాకు అర్థం కాలేదు? అశ్వత్థామ వంటి వారిని కృష్ణుడింత శక్తిమంతుడు తనను రక్షించమని ఎలా అడుగుతాడు? ఈ విషయంలో మీ(మేకర్స్) నిర్ణయాలు తప్పు. ఇతిహాసాలను పరిశీలించి స్క్రిప్ట్ రాసుకోవాలి" అని అన్నారు. అయితే కల్కి సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. మహాభారత్‌ సీరియల్‌ లో భీష్ముని పాత్రలో కనిపించిన ముకేష్ తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు.

Tags:    

Similar News

eac