రీమేక్ వార్తల్ని ఖండించిన స్టార్ డైరెక్టర్!
ఇది సర్కార్ రీమేక్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రచారాన్ని మురగదాస్ తీవ్రంగా ఖండించారు.;
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో మురగదాస్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'సికిందర్' చిత్రాన్ని తెరకె క్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే చిత్ర టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే టీజర్ కి అనుకున్నంతగా గొప్ప రెస్పాన్స్ రాలేదు. రొటీన్ గా అనే తేలిపోయింది. అయితే ఈ సినిమా కోలీవుడ్ చిత్రం 'సర్కార్' కి రీమేక్ అనే ప్రచారం కూడా చాలా కాలంగా జరుగుతోంది.
గతంలో కొన్ని సినిమాలు సల్మాన్ తో మురగదాస్ రీమేక్ చేసి హిట్ అందుకున్న నేపథ్యంలో తన 'సర్కార్' నే మళ్లీ హిందీలో రీమేక్ చేస్తున్నాడని గట్టి ప్రచారం జరుగుతోంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రచారం ఏకంగా పీక్స్ కి చేరింది. ఇది సర్కార్ రీమేక్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రచారాన్ని మురగదాస్ తీవ్రంగా ఖండించారు. 'సికిందర్' ఏ సినిమాకి రీమేక్ కాదని స్పష్టం చేసారు.
తన సొంత కథతో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ఇదని అన్నారు. దీంతో 'సికిందర్', 'సర్కార్' కి రీమేక్ కాదని తేలిపోయింది. అయితే ఈ సినిమాని మురగదాస్ ఎంత క్రియేటివ్ గా తెరకెక్కించాడు? అన్నది ఆసక్తికరంగా. మురగదాస్ సినిమాల్లో ఏదో స్పెషల్ మ్యాజిక్ ఉంటుంది. అతడు తీసేవి యాక్షన్ ఎంటర్ టైనర్లు అయినా రోటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటాయి.
యాక్షన థాట్స్ అనేవి ఎంతో యూనిక్ గా క్రియేటివ్ గా ఉంటాయి. వాటిని ఎంతో బ్రిలియంట్ గానూ డీల్ చేస్తాడు. అదే మురగదాస్ ప్రత్యేకత. మిగతా యాక్షన్ చిత్రాల మేకర్స్ తో మురగదాస్ ని అదే వేరు చేస్తుంది. అయితే మురగదాస్ గత చిత్రాలు కొన్ని సరిగ్గా ఆడలేదు. దీంతో సికిందర్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని అంతా నమ్ముతున్నారు. ఈద్ సందర్భంగా మార్చి 28న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.