సలార్‌ : నైజాంలో మైత్రి పంట పండింది

తెలుగు రాష్ట్రాల్లో సలార్‌ సినిమా కు నమోదు అవుతున్న కలెక్షన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేయబోతున్నట్లుగా అనిపిస్తోంది.

Update: 2023-12-24 10:38 GMT

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్‌' సినిమా సెన్షేషన్ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే భారీ వసూళ్లు నమోదు చేసింది. క్రిస్మస్ హాలీడేస్‌ సినిమాకు మరింతగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సలార్‌ సినిమా కు నమోదు అవుతున్న కలెక్షన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేయబోతున్నట్లుగా అనిపిస్తోంది. నైజాం ఏరియాలో మొదటి రెండు రోజుల్లో ఏకంగా రూ. 33.60 కోట్ల షేర్‌ ను సలార్ రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.

నైజాం ఏరియాలో సలార్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు పంపిణీ చేయడం జరిగింది. వారి చేసిన లాబీయింగ్‌ వర్కౌట్ అయ్యి నైజాం ఏరియాలో టికెట్ల రేట్లు భారీగా పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో మొదటి వారం రోజుల్లో సినిమాకు రాబోతున్న షేర్‌ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కేవలం రెండు రోజుల్లో 33.60 కోట్ల రూపాయల షేర్ దక్కింది. ఇక మూడవ రోజు ఆది వారం, నాల్గవ రోజు క్రిస్మస్‌, అయిదవ రోజు బాక్సింగ్ డే అవ్వడం తో సెలవు దినాలు. కనుక రాబోయే ఆ మూడు రోజుల్లో కూడా సలార్ సినిమా కు వచ్చే వసూళ్లు ఊహకు అందడం లేదు.

ఈ మధ్య కాలంలో నిర్మాణ సంస్థ గా భారీ లాభాలను సొంతం చేసుకున్న మైత్రి మూవీ సంస్థ నిర్మాతలు ఇప్పుడు నైజాం ఏరియాలో సలార్ సినిమా ను పంపిణీ చేయడం ద్వారా తమ సొంత సినిమాల కంటే కూడా ఎక్కువ లాభాలను దక్కించుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల షేర్‌ 71.52 కోట్ల రూపాయలుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రాబోయే మూడు రోజుల షేర్‌ కచ్చితంగా రూ.150 కోట్లకు చేరుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. లాంగ్ రన్‌ లో సలార్‌ ప్రభంజనం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News