దర్శకుడిగా శంకర్ వారసుడు.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఎంట్రీ!
దినేష్ మహీంద్ర సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, డైరెక్టింగ్‌పై పూర్తిస్థాయి శిక్షణ పొందాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు ఎన్. శంకర్. శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుని, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు. సామాజిక అంశాలను స్పృశిస్తూ కమర్షియల్ సినిమాలు రూపొందించడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇప్పుడు అదే దారిలో ఆ డైరెక్టర్ తనయుడు దినేష్ మహీంద్ర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దినేష్ మహీంద్ర సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, డైరెక్టింగ్‌పై పూర్తిస్థాయి శిక్షణ పొందాడు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో మెళకువలు నేర్చుకొని, స్క్రీన్‌ప్లే మీద ప్రత్యేకంగా కోర్సులు పూర్తి చేశాడు. సినిమా అంటే కేవలం కథే కాకుండా, టెక్నికల్ నైపుణ్యం కూడా కీలకమనే విషయం అర్థం చేసుకున్నాడు. ఫలితంగా తన దర్శకత్వంలోనే ఓ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇటీవలే ఈ ప్రాజెక్టును అధికారికంగా అనౌన్స్ చేశారు. కొత్త తారలతో, కొత్త టెక్నీషియన్లను పరిచయం చేస్తూ యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నాడు దినేష్ మహీంద్ర. ఈ చిత్రాన్ని ఆరెక్స్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, సంగీతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాటల రికార్డింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. షూటింగ్‌ను ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కథ పూర్తిగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని టాక్. యూత్ ట్రెండ్స్‌ను, నేటి తరం ప్రేమకథలను కొత్త కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు లో నటించబోయే కొత్త నటీనటుల ఎంపిక కూడా ఆసక్తిగా మారింది. యువతను ఆకట్టుకునేలా సంగీతం, విజువల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది.
ఎన్. శంకర్ తనయుడిగా కాకుండా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల దినేష్ మహీంద్రలో స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తదనం, భావోద్వేగాలతో కూడిన కథతో ప్రేక్షకుల మనసు దోచేందుకు అతను సిద్ధమవుతున్నారు. ఇక ఈ డెబ్యూ సినిమాపై పరిశ్రమలో కూడా మంచి అంచనాలున్నాయి. మొత్తానికి, టాలీవుడ్‌లో మరో కొత్త దర్శకుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆరెక్స్ క్రియేషన్స్ నిర్మాణంలో, దినేష్ మహీంద్ర దర్శకత్వంలో రాబోయే ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా అప్‌డేట్స్ విషయంలో త్వరలోనే మరింత క్లారిటీ ఇవ్వనున్నారు.