నా సామీ రంగ.. అసలైన ఘట్టం ముందుంది!
ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇక ఈ సినిమాకు ముందుంది అసలైన పరీక్ష. సంక్రాంతి రేసులో నా సామి రంగతో మరో మూడు సినిమాలు ఉన్నాయి.
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా మరికొద్దిరోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఇది వరకే సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజుతో వచ్చి సూపర్ హిట్ లు కొట్టిన నాగార్జున.. ఇప్పుడు మళ్లీ పండుగకే రావడంతో సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో నాగార్జునతోపాటు యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్రలను ఇప్పటికే చిత్రబృందం పరిచయం చేసేసింది. కమర్షియల్ కామెడీ అండ్ యాక్షన్ జోనర్ లో రాబోతున్న ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.
అయితే సంక్రాంతికి ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలన్న లక్ష్యంతో మేకర్స్ చాలా కష్టపడ్డారు. కేవలం 70 రోజుల్లో మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేశారు. అందుకు నాగార్జున కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ వయసులో నాగార్జున నాన్ స్టాప్ షూటింగ్ కు సహకరించడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అందులోనూ దర్శకుడు కూడా కొత్త వ్యక్తే. నిర్మాతల శ్రేయస్సు కోసం థియేట్రికల్ హక్కులను కొనేసిన నాగార్జున.. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ను దగ్గరుండి డీల్ కుదర్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇక ఈ సినిమాకు ముందుంది అసలైన పరీక్ష. సంక్రాంతి రేసులో నా సామి రంగతో మరో మూడు సినిమాలు ఉన్నాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్ కూడా పెద్ద పండుగకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలకు పోటీగా నిలబడాలంటే కచ్చితంగా నా సామిరంగ ప్రమోషన్స్ లో యూనిక్ నెస్ ఉండాలి.
విడుదల అయ్యాక కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకోవాలి. ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినా పరిస్థితి మారిపోతుంది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లో ఏదో ఒకటి ఫుల్ డామినేట్ చేస్తోంది. కానీ సినిమా విషయంలో మూవీ యూనిట్ ఫుల్ నమ్మకంగా ఉంది. పక్కా హిట్ గా కొడతామని చెబుతున్నారు. కీరవాణి మ్యూజిక్ తమ సినిమాకు కీలకమని అంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. మలయాళం పోరంజు మరియం జోస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. నాగార్జున సరసన ఈ సినిమాలో ఆషికా రంగానాథ్ నటిస్తున్నారు. బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి డెబ్యూ మూవీతో విజయ్ బిన్నీ, సంక్రాంతి సెంటిమెంట్ తో నాగార్జున హిట్ కొడతారో లేదో చూడాలి.