నా సామిరంగ బాక్సాఫీస్.. 2వ రోజు ఇంకా ఎక్కువగా..

నా సామిరంగ మూవీ ఆదివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు రూ.4.33 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు రూ.4.55 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

Update: 2024-01-16 06:16 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఇప్పటికీ అదే ఉత్సాహంతో కనిపిస్తున్న ఆయన.. తనదైన సినిమాలు చేస్తూ రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే నా సామి రంగ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన నా సామిరంగ మూవీ ఆదివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు రూ.4.33 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ఈ సినిమా.. రెండో రోజు రూ.4.55 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సోమ‌వారం ఇర‌వై ల‌క్ష‌లకు పైగా క‌లెక్ష‌న్స్ పెరిగాయి. రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా నా సామిరంగ మూవీ రూ.17.8 కోట్ల గ్రాస్ క‌లెక్షన్స్ రాబ‌ట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమ‌వారాల్లో క‌లిపి రూ.8.88 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. రెండో రోజు నా సామిరంగ మూవీ నైజాంలో వ‌సూళ్ల ప‌రంగా అద‌ర‌గొట్టింది. పండుగ కావ‌డంతో ఈ సినిమా క‌లెక్షన్స్‌ కు హెల్ప‌యింది. ఇక రెండో రోజు ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు ఇలా..

నైజాం : రూ.1.47 కోట్లు

సీడెడ్ : రూ.76 ల‌క్ష‌లు

వైజాగ్ : రూ.57 ల‌క్ష‌లు

ఈస్ట్ గోదావ‌రి : రూ.54 ల‌క్ష‌లు

వెస్ట్ గోదావరి : రూ.34 లక్షలు

గుంటూరు : రూ.41 లక్షలు

నెల్లూరు : రూ.20 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్ : రూ.4.55కోట్లు

టోటల్ 2డేస్ తెలుగు రాష్ట్రాల షేర్ : రూ.8.88 కోట్లు

టోటల్ 2డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ.17.8 కోట్లు

రెండో రోజు వసూళ్లు పిక‌ప్ కావ‌డంతో సినిమా యూనిట్ మ‌రిన్ని ప్ర‌మోష‌న్స్ చేయాల‌ని ఫిక్స్ అయినట్లు తెలిసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌ గా రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ తో ఈ మూవీ రిలీజైంది. లాభాల్లోకి అడుగుపెట్ట‌డానికి మ‌రో ప‌ది కోట్ల దూరంలో ఉందీ సినిమా.

స్నేహం, ప్రేమ అంశాల‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు అల్ల‌రి న‌రేష్‌, రాజ్‌ త‌రుణ్ హీరోలుగా న‌టించారు. ఆషికా రంగ‌నాథ్, రుక్స‌ర్ థిల్లాన్‌, మిర్నా మీన‌న్ హీరోయిన్లుగా క‌నిపించారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ బిన్నీ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మ‌ల‌యాళంలో సూపర్ హిట్ అయిన పురింజు మ‌రియం జోస్ రీమేక్‌ గా నా సామిరంగ మూవీ తెర‌కెక్కింది.

Tags:    

Similar News