సాగర కన్యగా ఇస్మార్ట్ బ్యూటీ..!

ఒంటికి అంటుకుపోయినట్టుగా వేసుకున్న అమ్మడి డ్రెస్.. పరువాలకు పనిచెబుతూ నభా చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమెకు మంచి మైలేజ్ తెచ్చి పెట్టేలా చేస్తుంది.

Update: 2023-11-21 16:21 GMT

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ చేసిన తక్కువ సినిమాలతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. కన్నడలో వరుస 3 సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఐదేళ్ల కెరీర్ లో 7 సినిమాలు చేసింది. వాటిలో ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో సినిమా ఆమెకు క్రేజ్ తీసుకు రాలేదు. 2021 లో మ్యాస్ట్రో సినిమా చేసిన నభా నటేష్ ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. మధ్యలో ఒక యాక్సిడెంట్ వల్ల ఆడియన్స్ కు దూరంగా ఉన్న అమ్మడు ఫైనల్ గా మళ్లీ తన గ్లామర్ ట్రీట్ తో అలరిస్తుంది.


సినిమాలు చేసినా చేయకపోయినా నభా నటేష్ సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ మాత్రం అదరగొట్టేస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ చూసిన ఎవరైనా సరే ఆమె మాయలో పడక తప్పదు. సినిమా ఛాన్స్ లు రావట్లేదా లేక తనే కావాలని చేయట్లేదా అన్నది తెలియదు కానీ ఫోటో షూట్స్ తోనే సరి పెట్టుకుంటుంది నభా నటేష్. ఇక లేటెస్ట్ గా స్కిన్ టైట్ డ్రెస్ తో మరోసారి వావ్ అనిపించేలా చేసింది అమ్మడు.


ఒంటికి అంటుకుపోయినట్టుగా వేసుకున్న అమ్మడి డ్రెస్.. పరువాలకు పనిచెబుతూ నభా చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమెకు మంచి మైలేజ్ తెచ్చి పెట్టేలా చేస్తుంది. క్రీం కలర్ డ్రెస్ లో సాగర కన్యలా అలా నభా చూసే చూపులకు ఎలాంటి వారైనా సరే డిస్టర్బ్ అవ్వాల్సిందే అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ వల్లే 5 మిలియన్స్ దగ్గర దాకా ఫాలోవర్స్ ని ఏర్పరచుకుంది అమ్మడు.


ప్రస్తుతం నభా నటేష్ లేటెస్ట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ తోనే ఇంత హంగామా సృష్టిస్తుంటే నభా వరుస సినిమాలు చేస్తే మాత్రం స్టార్ రేంజ్ కి వెళ్లడం పక్కా అని చెప్పొచ్చు. ఇక అమ్మడి సినీ కెరీర్ అంత దూకుడుగా లేకపోయినా ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ తోనే నభా గ్రాఫ్ పెరుగుతుంది. కచ్చితంగా కొద్దిగా వెయిట్ చేస్తే మాత్రం నభా నటేష్ కి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. అప్పటిదాకా నభా నటేష్ ఫోటో షూట్స్ తోనే ఆమె ఫ్యాన్స్ అడ్జెస్ట్ అవ్వాల్సిందే మరి.


Tags:    

Similar News