పెళ్ల‌యిన వెంట‌నే #SoChay ముంబైకి ఛ‌లో!

న‌వ‌వ‌ధూవ‌రులు జంటగా మొదటిసారి శివాల‌యంలో భ‌క్తి పార‌వ‌శ్యంలో కనిపించారు. పెళ్ల‌యి ఇంకా వారం అయినా గ‌డ‌వ‌లేదు.

Update: 2024-12-12 11:36 GMT

శోభిత ధూళిపాళ- నాగ చైతన్య జంట వివాహ మ‌హోత్స‌వం తెలుగు సాంప్ర‌దాయంలో క‌న్నుల‌పండుగ‌గా సాగింది.. ఈ వేడుక హైదరాబాద్‌లోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల స‌మ‌క్షంలో సింపుల్ గా జరిగింది. #SoChay పెళ్లిలో కంజీవరం పట్టు చీరలో శోభిత ఎంతో అందంగా క‌నిపించ‌గా, నాగ‌ చైతన్య తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించాడు. డిసెంబర్ 6 ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ఆలయంలో ఆశీర్వాదం అందుకుంది ఈ జంట‌.

న‌వ‌వ‌ధూవ‌రులు జంటగా మొదటిసారి శివాల‌యంలో భ‌క్తి పార‌వ‌శ్యంలో కనిపించారు. పెళ్ల‌యి ఇంకా వారం అయినా గ‌డ‌వ‌లేదు. ఇంత‌లోనే ఈ జంట ముంబైకి వెళ్లింది. బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ కుమార్తె ఆలియా కశ్యప్ పెళ్లిలో సంద‌డిగా క‌నిపించారు. తన దీర్ఘకాల భాగస్వామి షేన్ గ్రెగోయిర్‌ను ఆలియా క‌శ్య‌ప్ ముంబైలో అందమైన సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అందాల క‌థానాయిక‌లు స‌హా ప‌లువురు టాప్ సెల‌బ్రిటీలు అటెండ్ కాగా, టాలీవుడ్ నుంచి శోభిత‌- నాగ‌చైత‌న్య జంట ప్ర‌త్యేక అతిథులుగా సంద‌డి చేసారు. ఈవెంట్ లో చై అందంగా స్మైలిస్తూ సూట్ లో ఇస్మార్ట్ గా క‌నిపించ‌గా, శోభిత ట్రెడిష‌న‌ల్ పంజాబీ దుస్తుల‌లో ఎంతో ముచ్చ‌ట‌గా క‌నిపించింది. సో చై జంట ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఫోజులిస్తూ మీడియాకు ఎంత‌గానో స‌హ‌క‌రించారు.

ఆలియా - షేన్ గత సంవత్సరం ముంబైలో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. మే 2023లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్త‌ను అధికారికంగా ప్రకటించారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. శోభిత చివరిసారిగా లవ్ సితారలో కనిపించారు. చైతన్య తదుపరి `తండేల్‌`లో క‌నిపించ‌నున్నాడు. చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తండేల్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 7న‌ విడుద‌ల కానుంది.

శోభిత బాలీవుడ్ క‌నెక్ష‌న్‌తోనే..

ఆలియా క‌శ్య‌ప్ పెళ్లికి సో చై జంట‌కు ఆహ్వానం ఎలా అందింది? అంటే.. శోభిత‌కు ఉన్న స‌త్సంబంధాలే కార‌ణ‌మ‌ని తెలిసింది. అనురాగ్ తన 2016 క్రైమ్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0తో శోభితకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. తరువాత నెట్‌ఫ్లిక్స్ ఇండియా 2020 హారర్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో అనురాగ్ సెగ్మెంట్ లో న‌టించింది. అనురాగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన గీతూ మోహన్‌దాస్ 2019 మలయాళ యాక్షన్ థ్రిల్లర్ `మూథోన్‌`లో కూడా శోభిత క‌థానాయిక‌గా న‌టించింది. హిందీ చిత్ర‌సీమ‌లో శోభిత మ‌నుగ‌డ‌కు అనురాగ్ కీల‌క స‌హ‌కారం అందించారు. అలా అనురాగ్ క‌శ్య‌ప్ కుమార్తె ఆలియా క‌శ్య‌ప్ కి శోభిత స‌న్నిహితురాలైంది. ఆలియా పెళ్లిలో కొత్త‌గా పెళ్ల‌యిన‌ శోభిత ఎంతో స్వేచ్ఛ‌గా త‌న భ‌ర్త‌తో సంద‌డి చేసింది.

Tags:    

Similar News