అక్కినేని ఇంట పెళ్లికి అన్నపూర్ణ ముస్తాబవుతోందా?
కొన్ని నెలల క్రితం నాగచైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్దం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే
అక్కినేని ఇంట పెళ్లి హడావుడి మొదలైపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం నాగచైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్దం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సబ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని ఇంట వేడుక జరగింది. అయితే పెళ్లి వేడుక మాత్రం హైదరాబాద్ కాదని, రాజస్తాన్ లో జరుగుతుందని ఆ తర్వాత ప్రచారం సాగింది. దీంతో పెళ్లి తేది ఎప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా డిసెంబర్ 4న ఈ వివాహం హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వేదికను రాజాస్తాన్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకు మార్చినట్లు సమాచారం. దీంతో పెళ్లి వేడుకకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియో ను ముస్తాబు చేస్తున్నారుట. స్టూడియోలో ఓ ప్రత్యేక పెళ్లి మండపం నిర్మిస్తున్నారట. దీని కోసం సినిమా రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
పెళ్లి సింపుల్ గాచేసుకున్నా ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దలు హాజరయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారుట. అందుకు తగ్గట్టు స్టూడియో స్పేస్ తీసుకుని అంతవరకూ ముస్తాబు చేస్తున్నారుట. అంబానీ కొడుకు పెళ్లికి డెకరేట్ చేసిన విధంగా అన్ని రకాల సౌకర్యాలతో అతిధుల కోసం ముస్తాబువుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగచైతన్య కొంత మంది స్నేహితులకు వెడ్డింగ్ కార్డులు కూడా పంపిణి చేసినట్లు సమాచారం.
ఇండస్ట్రీ నుంచి కూడా చైతన్య చాలా మంది స్నేహితుల్ని ఆహ్వానిస్తున్నాడుట. నాగార్జున-చైతన్య స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి సతీసమేతంగా ఆ దంపతుల్ని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అలాగే శోభిత దూళిపాళ కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.