రూ.250ల టిక్కెట్ రేటులో నిర్మాతకు ఎంత వస్తుందంటే..
సినిమాలు రిలీజ్ అయినపుడు మూవీ కలెక్షన్స్ ని మూడు విధాలుగా లెక్కిస్తారనే సంగతి అందరికి తెలిసిందే.
సినిమాలు రిలీజ్ అయినపుడు మూవీ కలెక్షన్స్ ని మూడు విధాలుగా లెక్కిస్తారనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఈ కలెక్షన్స్ నెంబర్ కూడా స్టార్ హీరోల సినిమాలకి అదనపు ప్రమోషన్ గా ఉపయోగపడుతుంది. దాంతో పాటు సినిమా రేంజ్ ని చెప్పడానికి మేకర్స్ వీటిని పోస్టర్స్ లో వేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందుకే సినిమా చూసే ఆడియన్స్ కూడా వాటి కలెక్షన్స్ తెలుస్తాయి.
ఫ్యాన్స్ అయితే ఈ కలెక్షన్స్ నెంబర్స్ ని ట్విట్టర్ లో హైలైట్ చేస్తూ తమ హీరో రేంజ్ ఇది అంటూ పోస్టులు పెడుతూ ఉంటారు. అలాగే హీరోల మార్కెట్ స్టామినాని కూడా నిర్మాతలు ఈ కలెక్షన్స్ నెంబర్ బట్టి కేలిక్యులేట్ చేస్తూ ఉంటారనే టాక్ ఉంది. అయితే అసలు సినిమా కలెక్షన్స్ పరంగా మేకర్స్, ట్రేడ్ లెక్కలలో కనిపించే ఈ గ్రాస్, నెట్, షేర్ అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ వీటి గురించి చాలా ఈజీగా అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పారు. అసలు గ్రాస్, నెట్, షేర్ కి డిఫరెన్స్ ఏంటనేది యాంకర్ నిర్మాతని ప్రశ్నించారు. దీనిపై అతను సమాధానం ఇచ్చారు. థియేటర్స్ లో టికెట్స్ సేల్ ద్వారా వచ్చే కలెక్షన్స్ మొత్తాన్ని గ్రాస్ అంటాడు.
అందులో ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ పోగా మిగిలింది నెట్ కలెక్షన్స్ గా కౌట్ చేస్తారు. వీటిలో కూడా ఎగ్జిబిటర్లు, థియేటర్స్ పర్సెంటేజ్ కట్ చేయగా ఫైనల్ గా నిర్మాతకి వచ్చేది షేర్ క్రింద చూపిస్తారు. ఒక టికెట్ రేట్ 250 ఉంటే దాంట్లో నిర్మాతకి వచ్చేది 100 రూపాయిలు మాత్రమే అని చెప్పారు. మిగిలిన దాంట్లో 18 శాతం వరకు గవర్నమెంట్ ట్యాక్స్ క్రింద కట్ అవుతుంది. మిగిలిన దాంట్లో కొంత మొత్తం సినిమా థియేటర్స్ లో ఆడిన వారాల బట్టి ఎగ్జిబిటర్ల షేర్ పెర్సెంటేజ్ గా పోతుందని చెప్పారు.
ఈ లెక్కలు చూసుకున్న తరువాత ఎంత బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయిన నిర్మాతలకి ఫైనల్ గా వచ్చేది తక్కువగానే ఉంటుందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కలెక్షన్స్ పై నాగవంశీ ఇచ్చిన ఈ క్లారిటీ పై ట్విట్టర్ లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక బడ్జెట్ పెరగడానికి ముఖ్య కారణం రెమ్యునరేషన్స్ అని ముందుగా అవి తగ్గించుకుంటే నిర్మాతలు సేఫ్ గా బిజినెస్ చేసుకోవచ్చని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే రన్ టైమ్ కు తగ్గట్టుగా షూటింగ్ చేస్తే కూడా అనవసర ఖర్చులు ఉండవని అంటున్నారు.