కెన్యా నేషనల్ పార్క్ లో నాగబాబు ఫ్యామిలీ!
వరుణ్ తేజ్..నిహారిక బయట దేశాల్లో కనిపిస్తారే! తప్ప నాగబాబు సతీసమేతంగా వెళ్లడం అన్నది చాలా అరుదుగా జరగుతుంది.
మెగా ఫ్యామిలీ లో నాగ బాబు ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్లడం అన్నది చాలా రేర్. వరుణ్ తేజ్..నిహారిక బయట దేశాల్లో కనిపిస్తారే! తప్ప నాగబాబు సతీసమేతంగా వెళ్లడం అన్నది చాలా అరుదుగా జరగుతుంది. తాజాగా నాగ బాబు ఫ్యామిలీ మొత్తం కెన్యా వెకేషన్‌కి వెళ్లినట్లు తెలుస్తుంది. నాగబాబు.. ఆయన సతీమణి..వరుణ్ తేజ్...నిహారిక నలుగురు లేక్ నకుర్ నేషనల్ పార్క్ లో దిగిపోయారు. నిహారిక ఇన్ స్టాలో ఫ్యామిలీతో అంతా కూర్చున్న ఓ ఫోటోని షేర్ చేసింది.
అంతా ఒకేచోట కుర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కెన్యాకి వెకేషన్ కి సెలబ్రిటీలు ఎవరూ పెద్దగా వెళ్లరు. కానీ నాగబాబు ఫ్యామిలీ అక్కడున్న నేషనల్ పార్క్ అందాల్నీ వీక్షించడం కోసం వెళ్లినట్లు తెలుస్తుంది. మరి ఇలా నలుగురు కలిసి వెకెషన్ కి వెళ్లడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అంటే ఇటీవలే ఆ ఫ్యామిలీలో కాస్త డిస్టబెన్స్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.
నిహారిక-చైతన్య విడాకులతో వేరయ్యారు. దీంతో సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అలాగే వరుణ్ తేజ్ నటించిన `గాండీవధారి అర్జున` కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలితాలు తారుమారయ్యాయి. ఆ రకంగా వరుణ్ తేజ్ అంచనాల తప్పాయి. దీంతో కొన్ని రోజుల పాటు ఇలా స్వస్థలానికి దూరంగా వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే నిహారిక ఇప్పటికే మళ్లీ తన వృత్తిలో తాను బిజీ అవుతుంది. కుటుంబ సహకారంతో తాను సాధించాలనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తుంది.
అలాగే వరుణ్ తేజ్ కూడా కొత్త సినిమా షూటింగ్ ల్లో బిజీ అవుతున్నారు. అయితే ఈ ఫ్యామిలీ పిక్ లో వరుణ్ తేజ్ కాబోయే భార్య లావణ్య త్రిపాఠీ మిస్ అయింది. ఇప్పటికే ఇద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఆ తర్వాత వచ్చే వెకేషన్ల అన్నింటిలోనూ లావణ్య కనిపిస్తుది.