NC24 కూడా పాన్ ఇండియా ప్లాన్..?

చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాతో వస్తున్న నాగ చైతన్య ఆ సినిమాతో భారీ టార్గెట్ ని పెట్టుకున్నాడని తెలుస్తుంది.

Update: 2024-06-19 01:30 GMT

చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాతో వస్తున్న నాగ చైతన్య ఆ సినిమాతో భారీ టార్గెట్ ని పెట్టుకున్నాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తండేల్ ప్రచార చిత్రాలు సినిమాపై సూపర్ హైప్ తీసుకు రాగా తప్పకుండా చైతన్య కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. ఐతే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య 24వ సినిమా కార్తీక్ దండు డైరెక్షన్ లో రాబోతుంది.

విరూపాక్ష సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తీక్ దండు నాగ చైతన్య కోసం అద్భుతమైన కథ రాసుకున్నాడట. అసలైతే తన నెక్స్ట్ సినిమాగా విరూపాక్ష సీక్వెల్ చేస్తాడని అనుకోగా చైతుతో డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. ఎలాగు నాగ చైతన్య తండేల్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే బాగుంటుందని అలా ఫిక్స్ చేశారట.

నాగ చైతన్య తండేల్ తర్వాత సినిమా కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించేందుకు వస్తుంది. కార్తీక్ దండు నాగ చైతన్య సినిమాకు సుకుమార్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుదని తెలుస్తుంది. కార్తీక్ చేసిన విరూపాక్ష సినిమాకు కూడా సుకుమార్ తన సపోర్ట్ అందించాడు. అందుకే చైతు సినిమాకు కూడా తన గురువు సుకుమార్ హెల్ప్ తీసుకుంటున్నాడు కార్తీక్.

తండేల్ పూర్తి చేయడమే ఆలస్యం కార్తీక్ చైతన్య సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. ఈ సినిమాను పర్ఫెక్ట్ షెడ్యూల్ తో అనుకున్న టైం లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెట్స్ మీదకు వెళ్లబోతున్న నాగ చైతన్య 24వ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో చైతన్య సరసన పూజా హెగ్దేని తీసుకునే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చైతన్య ప్లానింగ్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అక్కినేని హీరోల్లో సినిమా వెంట సినిమాతో వస్తున్న నాగ చైతన్య ఫలితం ఎలా ఉన్నా తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడు. తండేల్ తో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రిజల్ట్ అందుకునే ఛాన్స్ కనిపిస్తుండగా ఆ నెక్స్ట్ సినిమా కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వస్తున్నాడు నాగ చైతన్య.

Tags:    

Similar News