నాగచైతన్య - శోభితా.. నాగ్ ఇంట్లో ఏం జరుగుతోంది?

తాజాగా, వీరి ఎంగేజ్‌మెంట్‌ జరుగబోతోందని, అక్కినేని నాగార్జున స్వయంగా ఈ వార్తను అఫీషియల్ గా ప్రకటించనున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి

Update: 2024-08-08 06:45 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో అక్కినేని నాగచైతన్య వివాహంపై అనేక రకాల ఊహాగానాలు వచ్చిన వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారని పలు రకాల ఫొటోలు కూడా సోషల్ మీడియాలో రాగా అవి నిజమా కాదా అనే చర్చ గట్టిగానే నడిచింది. తాజాగా, వీరి ఎంగేజ్‌మెంట్‌ జరుగబోతోందని, అక్కినేని నాగార్జున స్వయంగా ఈ వార్తను అఫీషియల్ గా ప్రకటించనున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి.

2021లో సమంతతో విడాకులు తీసుకున్న తరువాత, నాగచైతన్య పేరు శోభిత ధూళిపాళ్లతో ఎక్కువగా వినిపిస్తోంది. వీరి మధ్య ఉన్న రిలేషన్‌పై అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. కానీ, ఇటీవల ఇద్దరూ కలిసి ఉన్నారని, ఫారిన్ వెకేషన్ లో వీళ్లిద్దరూ కలిసి కనిపించారు అంటూ గాసిప్స్ నిజం అనేలా ఫ్యాన్స్ లో చర్చ జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఆ ఇద్దరి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇప్పుడు, వీరి ఎంగేజ్‌మెంట్ జరిగే వార్తలపై పరిశ్రమలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది కేవలం ఎంగేజ్‌మెంట్ మాత్రమే కాదు, ఇరు కుటుంబాల మధ్య మొదటి సారి పరస్పర పరిచయంగా ఉందని, పెళ్లి గురించి మాట్లాడుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. నాగార్జున ఇంటి దగ్గరే ఈ మాట ముచ్చట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇరు కుటుంబాల సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చిన అనంతరం అఫీషియల్ గా నాగార్జున పెళ్లి పెద్దగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగచైతన్య శోభితా ఇద్దరు కూడా ఫొటోలతో వారి బంధం గురించి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి ఆ వార్త ఎప్పుడు వస్తుందో చూడాలి.

శోభిత ధూళిపాళ్ల గురించి మాట్లాడుకుంటే, 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచిన ఆమె, తరువాత మిస్ ఎర్త్ పోటీల్లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టిన శోభిత, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ చిత్రంలో నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇటీవల తెలుగులో "గూఢాచారి" మరియు "మేజర్" వంటి సక్సెస్‌ఫుల్ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందింది.

Tags:    

Similar News