నాగార్జున ఈసారి మిస్ అయినట్టేనా..?

కింగ్ నాగార్జున సినిమాల విషయంలో ఎందుకో చాలా లేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.

Update: 2024-08-04 11:41 GMT

కింగ్ నాగార్జున సినిమాల విషయంలో ఎందుకో చాలా లేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఇయర్ సంక్రాంతికి నా సామిరంగ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున ఆ సినిమా సక్సెస్ మీట్ లో ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వస్తానని ఫ్యాన్స్ కి చెప్పారు. ఐతే ఇప్పటివరకు నాగార్జున ఏ సినిమా మొదలు పెట్టలేదు. ధనుష్ తో కుబేర సినిమా చేస్తున్నాడు కానీ అది సోలో సినిమా కింద రాదు. అంతేకాదు ఒకటి రెండు సినిమాల్లో కూడా విలన్ రోల్స్ వచ్చినా చేయనని చెప్పాడట.

మరోపక్క సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. నాగార్జున హోస్ట్ గా మొదలు పెట్టాడంటే ప్రతి వీకెండ్ అంటే ఒకటి రెండు రోజులు దానికే కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నాగార్జున నెక్స్ట్ సినిమా సంక్రాంతికి మిస్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు అనిపిస్తుంది. నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నితోనే నాగార్జున మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. ఐతే దాని గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

అక్కినేని ఫ్యాన్స్ మాత్రం కింగ్ చేస్తున్న ఈ ఆలస్యానికి పిచ్చోళ్లవుతున్నారు. ఐతే నా సామిరంగా ని పూర్తి చేసినట్టుగానే 3 నెలల్లో అంటే సెప్టెంబర్ మొదలు పెట్టి అక్టోబర్, నవంబర్ లో పూర్తి చేసి జనవరిలో రిలీజ్ చేస్తారన్న టాక్ ఉంది. ఐతే ప్రతి సినిమా నా సామిరంగలా కుదురుతుంది అనుకుంటే పొరపాటే అవుతుంది. మరి మన కింగ్ ఏం ఆలోచిస్తున్నాడన్నది తెలియాల్సి ఉంది.

ఐతే నాగార్జున నెక్స్ట్ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైందని.. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతారని చెబుతున్నారు. ఐతే అదేదో బయటకు అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అనుకుంటున్నారు. ఇక కుబేర సినిమా విషయానికి వస్తే శేఖర్ కమ్ముల మరోసారి వింటేజ్ నాగార్జునని చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. సోలో సినిమాలే కాదు మల్టీస్టారర్ సినిమాలకు కూడా ఓకే చెబుతున్న నాగార్జున కథ డిమాండ్ చేస్తే చాలు కానీ నిడివి తక్కువ ఉన్న పాత్ర అయినా చేయడానికి సై అనేస్తారు. ఇప్పుడు కాదు ఆయన కొన్నేళ్లుగా అదే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కుబేరలో కూడా నాగార్జున ఎపిసోడ్స్ ఆడియన్స్ కు సర్ ప్రైజ్ అందిస్తాయని అంటున్నారు. నాగార్జున మాత్రం ఫ్యాన్స్ ని మెప్పించే కథలు, సినిమాలతో రావాలని సోలో సినిమా లేట్ చేస్తున్నారు.

Tags:    

Similar News