కల్కిలోకి వాళ్లు ఎలా వచ్చారంటే..?

సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ విజువల్స్ కి ఫిదా అయిపోయాడు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ మనం కూడా చేయొచ్చని ప్రూవ్ చేశాడు.

Update: 2024-07-27 09:26 GMT

ప్రభాస్ కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ తో అదరగొట్టేస్తుంది. ఇప్పటికే సినిమా 1000 కోట్ల పైన వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేయగా ఇంకా సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి అంటూ ఒక కొత్త సంచలనానికి నాంది పలికాడు. ప్రాజెక్ట్ కె అంటూ సినిమా మొదలు పెట్టి కల్కి అని అనౌన్స్ చేసి సినిమాను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.

సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ విజువల్స్ కి ఫిదా అయిపోయాడు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ మనం కూడా చేయొచ్చని ప్రూవ్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు క్రేజీ డైరెక్టర్స్ సినిమాలో భాగం అయ్యారు. అందులో ఒకరు రాజమౌళి కాగా మరొకరు రాం గోపాల్ వర్మ. సినిమాలో వీళ్లిద్దరిని తీసుకోవడం వెనుక విషయాన్ని వెల్లడించారు నాగ్ అశ్విన్. కల్కిలో ఆ పాత్రల కోసం వాళ్లను ఒప్పించాల్సి వచ్చింది. సినిమాను సపోర్ట్ చేయడానికి మంచి మనసుతో వాళ్లు ముందుకొచ్చారని అన్నాడు నాగ్ అశ్విన్.

సినిమాలో రాజమౌళి, ఆర్జీవి క్యామియోలు వారి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాయి. రాజమౌళి అయితే భైరవని పట్టుకోవాలని వెంటాడుతాడు అయితే అమ్మో ఈయనకు దొరికితే ఐదేళ్లు తినేస్తాడని బాహుబలి సినిమా కోసం తన డేట్స్ ఇచ్చిన విషయాన్ని డైలాగ్ రూపంలో సరదాగా వాడేశారు. ఐతే రాజమౌళి కూడా ఈసారి దొరికితే పదేళ్లు తీసుకుంటానని అంటాడు. మరో పక్క ఆర్జీవిని కూడా ఒక చిన్న సీన్ లో చూపించి షాక్ ఇచ్చాడు నాగ్ అశ్విన్.

రాజమౌళి, ఆర్జీవి కూడా కల్కి సినిమా సంథింగ్ స్పెషల్ అని అనుకోవడం వల్లే సినిమాలో వాళ్లు కూడా భాగమయ్యారు. శివ సినిమాతో తెలుగు సినిమానే కాదు అన్ని ఇండస్ట్రీలకు పెద్ద జర్క్ ఇచ్చిన డైరెక్టర్ ఆర్జీవి కాగా బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా రేంజ్ పెంచిన రాజమౌళి వీళ్లిద్దరిని కల్కి సినిమాలో భాగం చేసి నాగ్ అశ్విన్ ఆడియన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవి కూడా ఒక సాంగ్ లో అలా తళుక్కున పెరిసాడని తెలిసిందే. వీళ్లే కాదు హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, హీరోయిన్స్ మృణాల్, ఫరియా ఇలా చాలామంది క్యామియోలు ఆడియన్స్ ని మెప్పించాయి.

Tags:    

Similar News