కల్కి ప్రమోషన్స్‌... ట్విట్టర్‌ అధినేతకు ఆహ్వానం

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Update: 2024-05-29 05:34 GMT

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరిగ్గా నెల రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేందుకు థియేటర్లలో సందడి చేయబోతున్న కల్కి ప్రమోషన్స్‌ ను మెల్ల మెల్లగా జోరు పెంచుతున్నారు.


ఇటీవలే సినిమాలో అత్యంత కీలకమైన బుజ్జి కారును పరిచయం చేశారు. భారీ ఈవెంట్ ను నిర్వహించి బుజ్జీ ని పరిచయం చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అంతే కాకుండా బుజ్జీ ని రోడ్డు పైకి తీసుకు వచ్చి ప్రముఖులతో డ్రైవ్‌ చేయించడం ద్వారా మరింతగా పబ్లిసిటీని చేస్తున్నారు.

ప్రస్తుతం బుజ్జీ చెన్నై రోడ్డు మీద చక్కర్లు కొడుతోంది. చెన్నై లో రోడ్డు పై వెళ్తున్న బుజ్జీ ని చూసి జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా కోసం ఇంతటి రియల్‌ వాహనం తయారు చేయడం అనేది నిజంగా సాధారణ విషయం కాదు అన్నట్టుగా నెట్టింట చర్చ జరుగుతుంది.

ఇదే సమయంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్ ట్విట్టర్‌ (ఎక్స్‌) లో ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ అధినేత, స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ మరియు టెస్లా అధినేత అయిన ఎలన్‌ మస్క్‌ ను బుజ్జీ ని డ్రైవ్‌ చేసేందుకు గాను ఆహ్వానించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ట్విట్టర్ లో నాగ్‌ అశ్విన్‌... ప్రియమైన ఎలన్‌ మస్క్‌ సర్‌.. మా బుజ్జీ ని చూడటానికి మరియు డ్రైవ్‌ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది 6 టన్నుల బరువుతో పూర్తిగా ఇండియాలో తయారు చేయబడిన ఫుల్లీ ఎలక్ట్రిక్‌ కారు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. మీరు బుజ్జీ ని ఒక సారి చూస్తే తప్పకుండా నచ్చుతారు అన్నట్లుగా నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇలాంటి ప్రత్యేకమైన ఆవిష్కరణలు అంటే ఎలన్‌ మస్క్ కి చాలా ఆసక్తి. అందుకే మన బుజ్జీ గురించి ఖచ్చితంగా మస్క్ ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆనంద్‌ మహీంద్ర బుజ్జీ గురించి సోషల్‌ మీడియాలో స్పందించిన విషయం తెల్సిందే. మస్క్‌ వంటి వారు బుజ్జీ ని డ్రైవ్‌ చేస్తే కచ్చితంగా హాలీవుడ్‌ రేంజ్ లో కల్కి స్థాయి పెరగడం ఖాయం.

Tags:    

Similar News