కల్కి విషయంలో అది ఒప్పేసుకున్న నాగ్ అశ్విన్..!

కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా డౌట్లు రేజ్ అవుతున్నాయి వాటి గురించి ఇంకా మీడియా మిత్రులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు నాగ్ అశ్విన్.

Update: 2024-07-05 17:22 GMT

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు. సినిమా లాస్ట్ వీక్ రిలీజై సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రిలీజ్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇన్నాళ్లకు మీడియా మీట్ ఏర్పాటు చేశారు. కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా డౌట్లు రేజ్ అవుతున్నాయి వాటి గురించి ఇంకా మీడియా మిత్రులు అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు నాగ్ అశ్విన్.

కల్కి సినిమా చేయడం వల్ల సై ఫై సినిమాలు మరొకరు ప్రాయత్నిచేలా స్పూర్తి ఇస్తుందని అన్నారు. ఆ విషయంలో సినిమా సక్సెస్ సాధించిందని అన్నారు. కల్కి సినిమాలో ఎక్కడో నాగ్ అశ్విన్ మార్క్ ఎమోషన్ మిస్ అయ్యిందన్న ప్రశ్నకు సమాధానంగా సినిమా కథ ప్రకారం చేసుకుంటూ వెళ్లామని బహుశా అది జరిగి ఉండొచ్చు కానీ ఈ కథకు ఇదే కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నారు. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై కూడా స్పందించిన నాగ్ అశ్విన్ అది అలానే రాసుకున్నామని అన్నారు. ఫన్నీగా రెగ్యులర్ గాయ్ లానే భైరవ పాత్ర రాసుకున్నానని అన్నారు.

Read more!

సినిమా కథకు తగిన కాస్టింగ్ దొరికిందని.. ఈ సినిమాలో నలుగురు ముఖ్య పాత్రలు వారి బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్, అమితాబ్ బచ్చ, దీపిక పదుకొనె, కమల్ హాసన్ పాత్రల వల్ల సినిమా ఈ స్థాయిలో నిలిచిందని అన్నారు నాగ్ అశ్విన్. ఇక కల్కి మొదటి పార్ట్ అంతా కథలో 40 శాతం మాత్రమే జరిగిందని అన్నారు నాగ్ అశ్విన్. కల్కి 2 సినిమా చాలా గ్రాండియర్ గా ఉంటుందని సినిమాలో కొన్నిటికి సమాధానం సెకండ్ పార్ట్ లో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.

ఇంకా సెకండ్ పార్ట్ లో కొన్ని క్యామియోలు ఉంటాయని అన్నారు నాగ్ అశ్విన్. సోషల్ మీడియాలో కృష్ణుడిగా మహేష్ బాబుని తీసుకుంటే బాగుంటుందని అంటున్నారని అడిగితే నాగ్ అశ్విన్ ఆయన ఈ సినిమాకు కాదు వేరే సినిమాకు చేస్తే బాగుంటుందని అన్నారు. మొత్తానికి కల్కి పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ ఏంటి.. ఆయన ఎలా ఈ సినిమాను మొదలు పెట్టారు. 4 ఏళ్ల టైంలో సినిమా తో ఆఉయన పొందిన ఎక్స్ పీరియన్స్ వీటన్ని గురించి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు కొన్ని పోర్షన్స్ ఇంకాస్త బెటర్ గా చేసి ఉండొచ్చేమో అని కూడా అన్నారు. మొత్తానికి కల్కి గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సినిమా మీద ఇంకాస్త ఇంపాక్ట్ పెరిగేలా చేసింది.

Tags:    

Similar News

eac