ఇండ‌స్ట్రీ టాప్ స్టార్ల‌కు ధీటైన హీరో అదృశ్యం!

రంగుల ప్ర‌పంచంలోకి చాలా మంది న‌టీనటులు సక్సెస్ అవ్వాలనే కలతో అడుగుపెడ‌తారు కానీ కొంతమంది మాత్రమే ఇక్క‌డ స‌క్సెస్ అందుకుని సూపర్ స్టార్ అవుతారు.

Update: 2024-05-14 03:50 GMT

ఈరోజు భార‌త‌దేశంలో గొప్ప హీరోలు అంటూ ఖాన్ ల త్ర‌యం గురించి చెప్పుకుంటున్నాం కానీ.. ఆ ముగ్గురినీ రేసులో వెన‌క్కి నెట్టేసేంత స్పీడ్ తో వ‌చ్చిన ఒక సూప‌ర్‌స్టార్ అనూహ్యంగా మొద‌టి బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత తెర‌వెన‌క్కి వెళ్లిపోయిన క‌థ గురించి తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోకుండా ఉండ‌లేం. అత‌డు గ్యారెంటీగా ఖాన్ ల‌ను సైతం వెన‌క్కి నెట్టేంత స‌మ‌ర్థుడు. కానీ అత‌డి కెరీర్ మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ (అత‌డికి రెండో చిత్రం)తోనే ఎండ్ అయింది. ఇంత‌కీ అత‌డు ఏమ‌య్యాడు? అంటే అది చాలా కాలం పాటు మిస్ట‌రీగానే ఉండిపోయింది. అస‌లు ఆ మిస్ట‌రీ ఏమిటో తెలుసుకోవాల‌నే ప్రయ‌త్నం చేస్తే .. దానివెన‌క కార‌ణాలు షాకింగ్ గా ఉన్నాయి... దీనిపై డీప్ గా వివ‌రాల్లోకి వెళితే..

రంగుల ప్ర‌పంచంలోకి చాలా మంది న‌టీనటులు సక్సెస్ అవ్వాలనే కలతో అడుగుపెడ‌తారు కానీ కొంతమంది మాత్రమే ఇక్క‌డ స‌క్సెస్ అందుకుని సూపర్ స్టార్ అవుతారు. బాలీవుడ్‌లో రెండో సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి, హఠాత్తుగా నటనకు స్వస్తి చెప్పి సినీ ప్రపంచానికి దూరమైన స‌ద‌రు నటుడి క‌థ ఎంతో ఆశ్చ‌ర్య‌పరుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. 2002లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నకుల్ కపూర్...

నకుల్ కపూర్ తన మొదటి సినిమాతోనే సంపాదించుకున్న స్టార్ డమ్ ఔత్సాహిక న‌టులెంద‌రో క‌ల‌లు క‌నే క్ష‌ణం. అయితే నకుల్ ఆరంగేట్ర‌మే ఘ‌న‌విజయం సాధించినప్పటికీ అత‌డు అనూహ్యంగా నటనా ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. నకుల్ కపూర్ `హో గయీ హై మొహబ్బత్ తుమ్సే` ఆల్బమ్‌తో మ్యూజిక్ వీడియోలో కనిపించడం ద్వారా న‌ట‌ వృత్తిని ప్రారంభించాడు. అతడు 2001లో `ఆజా మేరే యార్` చిత్రంలో న‌టించాడు కానీ, .. 2002లో `తుమ్ సే అచ్ఛా కౌన్ హై` రిలీజ్‌తో న‌టుడిగా గొప్ప‌ కీర్తిని పొందాడు. `తుమ్ సే అచ్చా కౌన్ హై` సినిమాతో నకుల్ కపూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని అంతటా చర్చనీయాంశం అయ్యింది. బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లు - సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ , అమీర్ ఖాన్ తర్వాత అతడు అంత పెద్ద సూపర్ స్టార్ అని ప్రచారం జ‌రిగింది. అయితే నకుల్ కపూర్ అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి గ్లిట్జ్ అండ్ గ్లామర్ ప్రపంచం నుండి అదృశ్యమయ్యాడు.

అయితే అత‌డు న‌ట‌న వ‌దిలేయ‌డానికి కార‌ణం రోడ్డు ప్రమాదంలో మరణించాడని కొన్ని మీడియాలు కథనాలు అల్లాయి. అనారోగ్యం కారణంగానే చనిపోయాడని మరికొన్ని మీడియాలు పేర్కొన్నాయి. కానీ న‌కుల్ కొన్ని నెలల తరువాత తాను ఇంకా జీవించి ఉన్నాన‌ని.. చ‌నిపోయిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు తప్పుడు వార్త‌ల‌ని ఖండించాడు. నకుల్ కపూర్ ఎల్లప్పుడూ ఆధ్యాత్మికతపై ఆసక్తిని కలిగి ఉన్నాడని, తన మొదటి హిట్ తర్వాత అతడు నటనకు స్వస్తి చెప్పి జీవితంలో ఆధ్యాత్మిక‌ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడని మీడియా నివేదికలు చెబుతున్నాయి. నకుల్ కపూర్ ఇప్పుడు తన కుటుంబంతో కెనడాలోని వాంకోవర్‌లో నివసిస్తున్నారు. అతడు డివైన్ లైట్ యోగాలో నిష్ణాతుడు.. యోగా బోధకుడు... సొంతంగా యోగాశ్ర‌మాల‌ను ర‌న్ చేస్తున్నారు.

Tags:    

Similar News